Kapu game : జ‌గ‌న్ `కాపు`కాచారు! వెట‌ర‌న్ `ట్రిక్స్` లో ప‌వ‌న్ !!

కాపు రిజ‌ర్వేష‌న్ (Kapu game) పోరాట‌యోధుడు ముద్ర‌గ‌డ,

  • Written By:
  • Publish Date - March 14, 2023 / 04:18 PM IST

కాపు రిజ‌ర్వేష‌న్ (Kapu game) పోరాట‌యోధుడు ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం, కాపు సేన అధిప‌తి హ‌రిరామ‌జోగ‌య్య(Jogayya) ఇద్ద‌రూ చంద్ర‌బాబు కు ద‌శాబ్దాలుగా రాజ‌కీయం వ్య‌తిరేకులు. తొలి నుంచి స్వ‌ర్గీయ వైఎస్ ఆర్ కు స‌న్నిహితంగా ఉండే పొలిటిక‌ల్ లీడ‌ర్లు. వాళ్ల రాజ‌కీయ ప్ర‌స్థానం కూడా ఎక్కువ‌గా కాంగ్రెస్ పార్టీ భావ‌జాలంతో ఇమిడి ఉంటుంది. కాంగ్రెస్ తానులోని ముక్క‌గా ఆవిర్భ‌వించిన‌ వైసీపీకి ప‌రోక్షంగా ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం స‌హ‌కారం అందించార‌ని అప్ప‌ట్లో బాగా వినిపించింది.

కాపు రిజ‌ర్వేష‌న్ పోరాట‌యోధుడు ముద్ర‌గ‌డ(Kapu game) 

ప్ర‌తిప‌క్ష నాయ‌కునిగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఉన్న‌ప్పుడు కాపు రిజ‌ర్వేష‌న్ల(Kapu game) కోసం ముద్రగ‌డ ప‌ద్మ‌నాభం ఉద్య‌మించారు. ర‌త్నాచ‌ల్ ఎక్స్ ప్రెస్ ను త‌గుల‌పెట్టే వ‌ర‌కు ఉద్య‌మాన్ని గ‌త ఎన్నిక‌ల ముందు తీసుకెళ్లారు. ఆయ‌న చేయిదాటి పోయిన కాపు రిజ‌ర్వేష‌న్ ఉద్య‌మం ఆనాడు చంద్ర‌బాబు ప్ర‌భుత్వాన్ని ఇరుకున‌పెట్టింది. అందుకే, ముద్ర‌గ‌డ‌ ఉద్య‌మాన్ని ఆప్ప‌ట్లో కొంద‌రు టీడీపీ కాపు నేత‌లు కూడా ఆరోపించారు. ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉన్న జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అప్ప‌ట్లో కాపు రిజ‌ర్వేష‌న్ల ఉద్య‌మానికి మ‌ద్ధ‌తు ఇచ్చారు. తీరా, అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ఆ రిజ‌ర్వేష‌న్ల గురించి ప్ర‌స్తావ‌న లేకుండా చేశారు. అడ‌గ‌డానికి ఏనాడూ ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం ధైర్యం చేసిన పాపాన పోలేదు. ఆయ‌న మీద విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు వ‌చ్చినప్పుడు మాత్రం ఒక‌టి రెండు సంద‌ర్భాల్లో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి లేఖ రాయ‌డం వ‌ర‌కు ప‌రిమితం అయ్యారు.

జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి అనుకూల ఫలితాలు ఉండే  ల‌క్ష్యంగా హ‌రిరామ జోగ‌య్య

ఇటీవ‌ల రిజ‌ర్వేష‌న్ల ఉద్య‌మం(Kapu game) నుంచి దాదాపుగా ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం త‌ప్పుకున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఆయ‌న స్థానంలో ఇప్పుడు మాజీ ఎంపీ హ‌రిరామ జోగ‌య్య(Jogayya) తెర‌మీద‌కు వ‌చ్చారు. కాపు సేన అధినేత‌గా ఆయ‌న రిజ‌ర్వేష‌న్ల గురించి మాట్లాడుతున్నారు. వాటిని అమ‌లు చేయాల‌ని జ‌న‌సేనాని ప‌వ‌న్ చేత డిమాండ్ చేయించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఒక వేళ ఆ డిమాండ్ తెర‌మీద‌కు బ‌లంగా వ‌స్తే, ఎన్నిక‌ల నాటికి బీసీలు వైసీపీ ప‌క్షాన నిలిచే అవ‌కాశం ఉంది. అంతిమంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి అనుకూల ఫలితాలు ఉండే ఛాన్స్ ఉంది. ఆ ల‌క్ష్యం దిశ‌గా హ‌రిరామ జోగ‌య్య ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని కొంద‌రు రాజ‌కీయ‌వేత్త‌ల అనుమానం. ఆ మేర‌కు అంత‌ర్గ‌తంగా చ‌ర్చ కూడా జ‌రుగుతోంది.

Also Read : Janasena : మ‌చిలీప‌ట్నం స‌భ‌పై`సువేరా`క‌థ‌నం వైర‌ల్

2019 ఎన్నిక‌ల్లో వైసీపీ 151 మంది ఎమ్మెల్యేల‌ను గెలుచుకోవ‌డం వెనుక కాపు రిజ‌ర్వేష‌న్ల (Kapu game)ఉద్య మం బాగా పని చేసింది. దాని కార‌ణంగా మంజునాథ‌న్ క‌మిటీని ఆనాడు సీఎంగా ఉన్న చంద్ర‌బాబు వేయాల్సి వ‌చ్చింది. ఫ‌లితంగా టీడీపీకి వెన్నుముఖ‌గా ఉండే బీసీ ఓటు బ్యాంకు చీలిపోయింది. కాపులతో పాటు మూకుమ్మ‌డిగా వైసీపీకి ఓటు ప‌డింది. అందుకే, 151 స్థానాలు వ‌చ్చాయ‌ని ఇప్ప‌టికీ చాలా మంది అంచ‌నా వేస్తుంటారు. ఇప్పుడు కూడా అదే ఈక్వేష‌న్ వ‌చ్చేలా హ‌రిరామ జోగ‌య్య (Jogayya)అడుగులు ఉన్నాయ‌ని కొంద‌రు లెక్కిస్తున్నారు. ఎందుకంటే, చంద్ర‌బాబునాయుడు హ‌యాంలో కాపు రిజ‌ర్వేష‌న్ల బిల్లును కేంద్రం అనుమ‌తి కోసం పంపారు. ప్ర‌స్తుతం ఆ బిల్లు ఢిల్లీ వ‌ర‌కు పరిమితం అయింది. దాన్ని అమ‌లు చేస్తామ‌ని చంద్ర‌బాబు చెప్పే వ‌ర‌కు హ‌రిరామ‌జోగయ్య ప్ర‌య‌త్నం చేస్తార‌ని తెలుస్తోంది. అందుకోసం చంద్ర‌బాబు మీద ప‌వ‌న్ ద్వారా ఒత్తిడి తీసుకొస్తార‌ని రాజ‌కీయ నిపుణులు అభిప్రాయం. అదే జ‌రిగితే, మ‌ళ్లీ బీసీలు తెలుగుదేశం పార్టీకి దూరం అవుతార‌ని ఎవ‌రైనా చెబుతారు.

మోడీ ఇచ్చిన 10శాతం రిజ‌ర్వేష‌న్ల‌లో 5శాతం కాపుల‌కు (Jogayya)

అగ్ర‌వ‌ర్ణ పేద‌ల‌కు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఇచ్చిన 10శాతం రిజ‌ర్వేష‌న్ల‌లో 5శాతం కాపుల‌కు (Kapu game)ఇస్తాన‌ని అప్ప‌ట్లో చంద్ర‌బాబు చెప్పారు. అంతేకాదు, బిల్లు కూడా అసెంబ్లీలో పెట్టి ఆమోదింప చేశారు. ఆ బిల్లు ప్రస్తుతం ఢిల్లీలో ఉంద‌ని చెబుతూ కాపు రిజ‌ర్వేష‌న్ల‌ను జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ అమ‌లు చేయ‌డంలేదు. అంతేకాదు, ఆ రిజ‌ర్వేష‌న్ల గురించి ప్ర‌స్తావిస్తే, కేంద్రం ప‌రిధిలోని అంశంగా దాట‌వేస్తూ బీసీల‌ను రాజ‌కీయంగా ద‌గ్గ‌ర‌కు తీసుకుంటుంది. సున్నిత‌మైన ఈ అంశాన్ని రాజ‌కీయంగా ర‌చ్చ చేయ‌డానికి గ‌తంలో ముద్ర‌గ‌డ ఇప్పుడు హ‌రిరామ జోగ‌య్య(Jogayya) సీన్లోకి వ‌చ్చారు. ఇదంతా వైసీపీ తెర వెనుక ఆడిస్తోన్న గేమ్ గా రాజ‌కీయ నిపుణులు భావిస్తున్నారు. ఎందుకంటే, ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం, హ‌రిరామ‌జోగ‌య్య ఇద్ద‌రూ అనాదిగా వైఎస్ కుటుంబం సానుభూతిప‌రులు. అందుకే, వాళ్ల‌ను ప్ర‌యోగిస్తూ కాపు రిజ‌ర్వేష‌న్ల‌ను ఎప్ప‌టికప్పుడు రాజ‌కీయ కోణం నుంచి తీసుకెళుతున్నార‌ని టీడీపీ అనుమానించ‌డాన్ని కాద‌న‌లేం.

ప‌వ‌న్ క‌ల్యాణ్ సీఎం అభ్య‌ర్థిగా ఉండాల‌ని

ఇలాంటి ప‌రిస్థితుల్లో ప‌వ‌న్ ఎంత వ‌ర‌కు హ‌రిరామ జోగ‌య్య(Jogayya) మాట‌లు వింటారు? కాపు రిజ‌ర్వేష‌న్ల డిమాండ్ జ‌నసేన చేస్తుందా? ఒక వేళ రిజ‌ర్వేష‌న్లు(Kapu game) డిమాండ్ చేస్తే బలిజ , తెల‌గ‌, ఒంట‌రి కులాల‌ను దూరం చేసుకోవాల్సి వ‌స్తుందా? ఇలాంటి ఎన్నో అంశాలు జ‌న‌సేన పార్టీలో అంత‌ర్గ‌తంగా చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి. కానీ, గ‌త నాలుగు రోజులుగా మ‌చిలీప‌ట్నం స‌న్నాహాక స‌మావేశాల‌ను ప‌రిశీలిస్తే, హ‌రిరామ జోగ‌య్య రిజ‌ర్వేష‌న్ల అంశాన్ని ప్ర‌ముఖంగా ప్ర‌స్తావిస్తున్నారు. అంతేకాదు, ప‌వ‌న్ క‌ల్యాణ్ సీఎం అభ్య‌ర్థిగా ఉండాల‌ని కోరుకుంటున్నారు. ఆ డిమాండ్ నెర‌వేర‌డం రాజ‌కీయంగా ఇప్ప‌ట్లో అసాధ్యమ‌ని ఆయ‌నకు తెలియ‌ని అంశం కాదు. ఎందుకంటే బీజేపీ, జ‌న‌సేన క‌లిసి వెళ్లిన‌ప్ప‌టికీ బీసీల‌కు సీఎం అభ్య‌ర్థి అంటూ ఇటీవ‌ల బీజేపీ చీఫ్ వీర్రాజు ప్ర‌క‌టించారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని వెళితే, సీఎం అభ్య‌ర్థి ప‌వ‌న్ అనేది అసంభ‌వం. ఇలాంటి ప‌రిస్థితుల్లో వైసీపీకి ప‌రోక్ష మేలు జ‌రిగేలా హ‌రిరామ జోగ‌య్య(Jogayya) వ్యూహాత్మ‌కంగా ప‌వ‌న్ ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నార‌ని ప‌వ‌న్ కోట‌రీలోని కొంద‌రి అనుమానం. మ‌రో వైపు ఒంట‌రిగా వెళ్లి రాజ‌కీయ వీర‌మ‌ర‌ణం పొంద‌డం కంటే పొత్తు అనివార్య‌మ‌ని ప‌వ‌న్ అంటున్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో ప‌వ‌న్ మ‌చిలీప‌ట్నం వేదిక‌గా ఇచ్చే దిశానిర్దేశం ఆస‌క్తిక‌రంగా మారింది.

Also Read : Pawan : జ‌న‌సేన‌కు కులం,మ‌తం బుర‌ద‌! కాపు,బ‌లిజ వాదం!!