Kapu Game : `వంగ‌వీటి` రాజ‌కీయ చ‌ద‌రంగంపై జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చెల‌గాటం!

స్వ‌ర్గీయ రంగా వేసిన `కాపు` పునాదుల‌ను(Kapu Game) జ‌గ‌న్ రెడ్డి క‌దిలిస్తున్నారు.

  • Written By:
  • Updated On - February 23, 2023 / 10:33 AM IST

స్వ‌ర్గీయ వంగ‌వీటి రంగా వేసిన `కాపు` పునాదుల‌ను(Kapu Game) ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి(Jagan) క‌దిలిస్తున్నారు. కాపు, బ‌లిజ‌, తెల‌గ‌, ఒంట‌రి కులాల‌ను ఏకం చేస్తూ వ్యూహాత్మ‌కంగా అప్ప‌ట్లో రాజ‌కీయ వ్యూహాన్ని రంగా ర‌చించారు. అందుకు భిన్నంగా ఆ కులాల మ‌ధ్య ఉన్న అంత‌రాన్ని బ‌య‌ట ప్ర‌పంచానికి తెలిసేలా రాజ‌కీయ చ‌ద‌రంగాన్ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ర‌చించారు. ఆ క్ర‌మంలో గోదావ‌రి జిల్లాల‌కు చెందిన శెట్టి బ‌లిజ‌ల‌కు ప్రాధాన్యం ఇస్తూ ఎమ్మెల్సీ అభ్య‌ర్థుల‌ ఎంపిక జ‌రిగింది. ఆ త‌రువాత బ‌లిజ సామాజిక‌వ‌ర్గానికి ప్రాముఖ్య‌త‌ను ఇచ్చారు. మొత్తం 18 మంది ఎమ్మెల్సీల్లో 14 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సంబంధించిన వాళ్లే. వెనుక‌బ‌డిన వ‌ర్గాల‌కు పెద్ద‌పీట వేస్తూ వాళ్ల‌లో శెట్టి బ‌లిజ‌, బ‌లిజ‌ల‌ను బీసీ కోటాలో వేసి చూపించారు.

స్వ‌ర్గీయ వంగ‌వీటి రంగా వేసిన `కాపు` పునాదుల‌ను(Kapu Game)

సామాజిక‌వ‌ర్గం ఈక్వేష‌న్ల ఆధారంగా ఓటింగ్ జ‌రిగే రాష్ట్రంగా ఏపీకి పేరుంది. అందుకే, కాపు సామాజిక‌వ‌ర్గాల నేప‌థ్యం, అంత‌ర్గ‌తంగా ఉండే గ్యాప్ ల‌ను (Kapu Game) రాజ‌కీయ పార్టీలు అధ్య‌య‌నం చేశాయి. ఆ విష‌యంలో ప్ర‌శాంత్ కిషోర్ రూపంలో వైసీపీ వ‌ద్ద క్షేత్ర‌స్థాయి రిపోర్ట్స్ ఉన్నాయ‌ని తెలుస్తోంది. అందుకే, శెట్టి బ‌లిజ‌ల‌కు ఎక్కువ‌గా గోదావ‌రి జిల్లాల్లో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్రాధాన్యం ఇచ్చారు. కాపుల‌కు ప్రాతినిథ్యం వ‌హించే పార్టీగా ముద్ర‌ప‌డ్డ జ‌నసేన చుట్టూ రాజ‌కీయ చ‌క్రాన్ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి (Jagan) తిప్పుతున్నారు. స్వ‌ర్గీయ రంగా చేసిన రాజ‌కీయ వ్యూహాన్ని అనుస‌రిస్తూ కాపు, బ‌లిజ‌, తెల‌గ‌, ఒంట‌రి అంతా కాపు సామాజిక‌వ‌ర్గం అనే రీతిలో ఇప్ప‌టి వ‌ర‌కు జ‌న‌సేన రాజ‌కీయం న‌డిపింది. కానీ, అంత‌ర్గ‌తంగా ఆ కులాల‌కు ఉండే అంత‌రాన్ని ఇప్పుడు వైసీపీ ఎలివేట్ చేస్తోంది.

Also Read : Kapu Reservation : టీడీపీ, జ‌న‌సేన `పొత్తు`పోటు, కాపు సేన అధిప‌తి ఎత్తుగ‌డ?

సామాజిక శాస్త్ర‌వేత్త‌ల అధ్య‌య‌నం ప్ర‌కారం గోదావ‌రి జిల్లాల్లో కాపులు, బ‌లిజ‌, శెట్టి బ‌లిజ‌లు(Kapu Game) వేర్వేరు. ఇచ్చిపుచ్చుకునే వ్య‌వ‌హారాలు ఆ కులాల మ‌ధ్య పెద్ద‌గా ఉండ‌వు. ప్ర‌త్యేకించి వివాహాల విషయంలోనూ కాపు, బ‌లిజ‌ల మ‌ధ్య ప‌ట్టింపులు ఉంటాయ‌ని తెలుస్తోంది. ఇక తెల‌గ‌, ఒంట‌రి కులాల‌ను కాపులు దూరంగా పెడ‌తార‌ని సామాజిక శాస్త్ర‌వేత్త‌ల అధ్య‌య‌నం చెబుతోంది. అదే ప్ర‌శాంత్ కిషోర్ ఇచ్చిన నివేదిక‌లోని కీల‌క సారాంశమ‌ని తెలుస్తోంది. అందుకే, జ‌న‌సేన రూపంలో కేవ‌లం కాపు ఓట్ల‌ను జారిపోయిన‌ప్ప‌టికీ బ‌లిజ‌, శెట్టి బ‌లిజ‌, తెల‌గ‌, ఒంట‌రి కులాలు త‌మ‌వైపు ఉంటాయ‌ని వైసీపీ భావిస్తోంది. ఆ కోణం నుంచి ఆ సామాజిక‌వ‌ర్గాల‌కు కాపుల కంటే పెద్ద పీట వేస్తూ ఎమ్మెల్సీ అభ్య‌ర్థుల ఎంపిక జ‌రిగింది.

కాపు సామాజిక‌వ‌ర్గం ఓట్లు జ‌న‌సేన‌కు ఎక్కువ‌గా వెళ‌తాయ‌ని

ఉత్త‌రాంధ్ర ప్రాంతంలోని కాపు సామాజిక వ‌ర్గం గొడుగు కింద ఉండే బ‌లిజ‌, శెట్టి బ‌లిజ‌, తెల‌గ‌, ఒంట‌రి కులాల‌ను వేరు చేయ‌డంలో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి(Jagan) దాదాపుగా విజ‌యం సాధించార‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లోని టాక్‌. ఇక రాయ‌ల‌సీమ ప్రాంతంలోని బ‌లిజ‌లు ఎప్పుడూ కాపులకు దూరంగా ఉంటార‌ని తెలుస్తోంది. ఎందుకంటే, బ‌లిజ‌లు బీసీ రిజ‌ర్వేష‌న్ ను అనుభ‌విస్తున్నారు. అలాగే, తెల‌గ‌, ఒంట‌రి కులాలు రిజ‌ర్వేష‌న్ ప‌రిధిలోకి వ‌స్తారు. కేవ‌లం కాపు సామాజిక‌వ‌ర్గం మాత్ర‌మే ప్ర‌స్తుతం రిజ‌ర్వేష‌న్ల‌ను కోరుకుంటోంది. వాటిని అమ‌లు చేయ‌డానికి సీఎం జ‌గన్మోహ‌న్ రెడ్డి సిద్ధంగా లేరు. దానికి కార‌ణం కాపు ఓట్ల కోసం రిజ‌ర్వేష‌న్ల‌ను అమ‌లు చేస్తే బ‌లిజ‌, శెట్టి బ‌లిజ‌, తెల‌గ‌, ఒంట‌రి కులాలు దూరం అవుతాయ‌ని(Kapu Game) అధికార పార్టీ అంచ‌నా. పైగా రిజ‌ర్వేషన్లు అమ‌లు చేసిన‌ప్ప‌టికీ కాపు సామాజిక‌వ‌ర్గం ఓట్లు జ‌న‌సేన‌కు ఎక్కువ‌గా వెళ‌తాయ‌ని క్షేత్ర‌స్థాయి వైసీపీ రిపోర్ట్ గా ప్ర‌చారం జ‌రుగుతోంది. అందుకే, కాపు మిన‌హా ఆ సామాజిక‌వ‌ర్గం గొడుగు కింద స్వ‌ర్గీయ రంగా చూపించిన మిగిలిన కులాల‌ను జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి విజ‌య‌వంతంగా బ‌య‌ట‌కు తీసుకొచ్చార‌ని తాడేప‌ల్లి వ‌ర్గాల్లోని టాక్.

Also Read : Vizag kapu : కాపునాడుకు వైసీపీ డుమ్మా, 5శాతం రిజ‌ర్వేజ‌న్ పై జ‌గ‌డం

ఒకప్పుడు టాలీవుడ్ కేంద్రంగా కాపు, బ‌లిజ మ‌ధ్య వ్య‌త్యాసంపై తీవ్ర స్థాయి చ‌ర్చ జ‌రిగింది. స్వ‌ర్గీయ దాస‌రి నారాయ‌ణ రావు కాపు సామాజిక‌వ‌ర్గం ఎవ‌రు? ఇత‌రులు ఎవ‌రు? అనే దానిపై అప్ప‌ట్లో పెద్ద చ‌ర్చ జ‌రిగేలా చేశారు. ఆ త‌రువాత స‌ర్దుమ‌ణిగిన‌ప్ప‌టికీ ఆ కులాల మ‌ధ్య వ్య‌త్యాసం, తార‌త‌మ్యం క్షేత్ర‌స్థాయిలో బ‌లంగా ఉంది. తొలి నుంచి రాయ‌ల‌సీమ‌లోని బ‌లిజ‌లు తెలుగుదేశం వైపు ఎక్కువ‌గా ఉన్నారు. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ (Jagan) వైపు మ‌ళ్లారు. కాపులు మాత్రం ఒకే పార్టీలో ఎప్పుడూ సాలిడ్ గా లేర‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయం. ఆ సామాజిక‌వ‌ర్గం ఓటు బ్యాంకు 5శాతానికి మించి ఉండ‌ద‌ని లెక్క‌. అందుకే, ఆ సామాజిక‌వ‌ర్గాన్ని బ‌లోపేతం చేసుకోవ‌డానికి మిగిలిన కులాల‌ను కూడా క‌లుపుకుని 18శాతం అంటూ స్వ‌ర్గీయ రంగా అప్ప‌ట్లో రాజ‌కీయ స్లోగ‌న్ తీసుకున్నారు. దాన్ని ఆ త‌రువాత త‌రం కంటిన్యూ చేస్తోంది.

కులాల‌ను వేరు చేయ‌డంలో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి దాదాపుగా విజ‌యం(Jagan)

ఇలాంటి ఈక్వేష‌న్ ఒక‌ప్పుడు స్వ‌ర్గీయ ఎన్టీఆర్ జాతీయ రాజ‌కీయాల వైపు మొగ్గు చూపిన‌ప్పుడు వినిపించారు. క‌మ్మ, వెల‌మ‌, జాట్ లు, రాజ్ పుత్ లు ఒకే తెగ మాదిరిగా ప్ర‌చారం చేశారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో కులంతో క‌మ్మ కులం మూలాలు తీసి అంద‌ర్నీ ఒక గొడుగు కింద‌కు తీసుకురావాల‌ని ఆనాడు రాజ‌కీయ వ్యూహాన్ని ర‌చించారు. ఆ త‌రువాత ప‌రిణామాలు క‌లిసి రాక‌పోవ‌డంతో ఆదిలోనే ఆయ‌న ఆలోచ‌న క‌నుమ‌రుగు అయింది. అయితే, ఇప్పుడు స్వ‌ర్గీయ రంగా వినిపించిన కాపు, బ‌లిజ‌, శెట్టి బ‌లిజ‌, తెల‌గ‌, ఒంట‌రి ఈక్వేష‌న్ ను(Kapu Game) జ‌న‌సేన ఇప్ప‌టి వ‌ర‌కు అనుస‌రించింది. దాన్ని బ్రేక్ చేస్తూ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి(Jagan) చేసిన ప్ర‌య‌త్నాలు రాబోవు ఎన్నిక‌ల్లో ఎలాంటి ఫ‌లితాలను రాబ‌డ‌తాయో చూడాలి.