Kapu fight : ముద్ర‌గ‌డ‌కు `తిక్క‌`రేగింది.! జ‌న‌సేనానిపై లేఖాస్త్రం!!

Kapu fight : సినిమా, రాజ‌కీయ రంగాల‌ను వేర్వేరుగా చూడ‌లేం. ఆ రెండు రంగాల‌ను ఎప్పుడో స్వ‌ర్గీయ ఎన్టీఆర్ క‌లిపేశారు.

  • Written By:
  • Updated On - June 20, 2023 / 03:35 PM IST

Kapu fight : సినిమా, రాజ‌కీయ రంగాల‌ను వేర్వేరుగా చూడ‌లేం. ఆ రెండు రంగాల‌ను ఎప్పుడో స్వ‌ర్గీయ ఎన్టీఆర్ క‌లిపేశారు. మొఖానికి రంగు వేసుకునే వాళ్లు రాజ‌కీయాల్లోకి ప‌నిరారు అనే వాదం త‌ప్ప‌ని ఎన్టీఆర్ నిరూపించారు. కానీ, సినిమా హీరోలు రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటే మేల‌నే భావ‌న క‌లిగించేలా చిరంజీవి, ప‌వ‌న్ వ్య‌వ‌హారం ఉంది. ప్ర‌జారాజ్యం పార్టీని పెట్టిన మెగా స్టార్ చిరంజీవి ప‌ట్టుమ‌ని ఏడాది కూడా న‌డ‌ప‌లేదు. ఆ పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్ లో క‌లిపేసిన ఎపిసోడ్ లో యువ‌రాజ్యం అధ్యక్షుడు ప‌వ‌న్(Pawan) కూడా ఉన్నారు. ప్ర‌జారాజ్యం సినిమా ఫెయిల్ అయిన త‌రువాత జ‌న‌సేన వ‌చ్చింది.

ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం ఇప్పుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ కు లేఖాస్త్రాన్ని సంధించారు (Kapu fight)

ప్ర‌జారాజ్యం పార్టీని (PRP) 2008వ సంవ‌త్స‌రంలో మెగా హీరోలు పెట్టారు. ఆ త‌రువాత ఏడాది దాన్ని కాంగ్రెస్ పార్టీలో క‌లిపేశారు. అందుకు వ‌చ్చిన ప్ర‌తిఫ‌లాన్ని చిరంజీవి అండ్ కో అనుభ‌వించారు. రాష్ట్రాన్ని విడ‌దీసిన కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రాద‌ని తెలుసుకున్న యువ‌రాజ్యం అధ్య‌క్షుడు 2014 ఎన్నిక‌ల‌కు కొన్ని నెల‌ల ముందు జ‌న‌సేన సినిమాకు క్లాప్ కొట్టారు. కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో చంద్ర‌బాబు(Chandrababu) అధికారంలోకి రావ‌డానికి కార‌ణం జ‌న‌సేన అంటూ సినిమాటిక్ ప్ర‌చారాన్ని చేసుకుంటూ వ‌చ్చారు. ప్ర‌జాక్షేత్రంలో 2018 వ‌ర‌కు క‌నిపించ‌కుండా నెట్టుకొచ్చారు. అనివార్యంగా 2019 ఎన్నిక‌ల్లో పోటీకి దిగాల్సి వ‌చ్చింది. దీంతో ఉభ‌య క‌మ్యూనిస్ట్ లు, బీఎస్పీ ల‌తో జ‌న‌సేనాని జ‌త క‌ట్టారు. అందుకోసం ఢిల్లీ , ల‌క్నో వేదిక‌లుగా మాయావ‌తి కోసం ప‌వ‌న్ ప‌డిన పాట్లు అంద‌రికీ తెలిసిన‌వే.

విశాఖ ఉక్కును ప్రైవేటుకు అమ్మేస్తోన్న పార్టీతో 2024 ఎన్నిల‌కు సిద్ద‌మ‌య్యారు

Kapu 2

సీన్ క‌ట్ చేస్తే, 2019 ఎన్నిక‌ల్లో రెండు చోట్ల ఓడిపోయిన ప‌వ‌న్ ఆ పార్టీకి గుర్తింపును కూడా పొంద‌లేక‌పోయారు. అప్ప‌టి వ‌ర‌కు చేగువీరా, కాన్షీరాం, చాక‌లి ఐల‌య్య, లెనిన్ పుస్త‌కాల‌ను ప‌ట్టుకుని తిరిగారు. వాటిని వ‌దిలేసి మోడీ, స‌వార్క‌ర్ , గాడ్సే పుస్త‌కాల‌ను 2019 ఎన్నిక‌ల త‌రువాత చ‌ద‌వ‌డం ప్రారంభించారు. హిందువుల‌కు అండ‌గా ఉంటానంటూ ఢిల్లీ వెళ్లి బీజేపీ పంచ‌న చేరారు. కానీ, ఏనాడూ రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం కేంద్రంలోని బీజేపీ మీద ఒత్తిడి తీసుకొచ్చిన పాపాన పోలేదు. విశాఖ ఉక్కును ప్రైవేటుకు అమ్మేస్తోన్న పార్టీతో 2024 ఎన్నిల‌కు సిద్ద‌మ‌య్యారు. అధికారంలోని వైసీపీ లీడ‌ర్ల‌ను బూతులు తిడుతూ వారాహి ఎక్కారు. కాపులంద‌రూ ఓటేసినా గెలుస్తానంటూ సెల‌విస్తున్నారు. స‌రిగ్గా ఇక్క‌డే కాపు జాతి(Kapu fight) ఉద్య‌మ‌నేత ముద్ర‌గ‌డ‌కు మండింది.

Also Read : Mudragada : జ‌న‌సేన‌కు చెక్ పెట్టేలా ముద్ర‌గ‌డ?

ఎవర్నైనా లేఖ‌లో టార్గెట్ చేసే సీనియర్ రాజ‌కీయ‌వేత్త ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం (Kapu fight) ఇప్పుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ కు లేఖాస్త్రాన్ని సంధించారు. పార్టీ పెట్టిన వాడు పది మందితో మంచిగా ఉండాల‌ని హిత‌వు ప‌లికారు. ఎమ్మెల్యేల‌ను, మంత్రుల‌ను బూతులు తిట్ట‌డానికి పార్టీ ఎవరూ పెట్ట‌ర‌ని చుర‌క‌లు వేశారు. ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు చీల‌కుండా బీజేపీ, జ‌న‌సేన‌, టీడీపీ కూట‌మిగా వెళ‌తాయ‌ని సంకేతాలు ఇస్తోన్న ప‌వ‌న్ (Pawan) సీఎం ఎలా అవుతారు? అనేది చెప్పాల‌ని నిల‌దీశారు. విధాన‌ప‌ర‌మైన అంశాల‌ను చెప్ప‌కుండా ప‌వ‌న్ ప్ర‌చారం సాగుతుంద‌ని విమ‌ర్శించారు. కాపు జాతి ప‌రువు తీసేలా ప‌వ‌న్ క‌ల్యాణ్ చేస్తోన్న వ్యాఖ్య‌లు ఉన్నాయని ఆవేద‌న చెందారు. ఇప్ప‌టికైనా ప‌ద్ధ‌తి మార్చుకుని నోటిని అదుపులో పెట్టుకోవాల‌ని కోరారు. పార్టీ సిద్ధాంతాలు ఏమిటో చెప్పాల‌ని సూచించ‌డం జ‌నసైన్యానికి మండుతోంది. సోష‌ల్ మీడియా వేదిక‌గా ముద్ర‌గ‌డ‌ను జ‌న‌సైనికులు టార్గెట్ చేస్తూ ర‌చ్చ చేస్తున్నారు.

Also Read : Janasena Mega plan :`సుఫారీ` సుడులు! ప‌వ‌న్ `హ‌త్య‌కు కుట్ర నిజ‌మా?