దేశ వ్యాప్తంగా రాజకీయాలు ఏమోకానీ..ఆంధ్రప్రదేశ్ (AP) లో మాత్రం కుల రాజకీయాల (AP Caste Politics) ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎన్నికల్లో పోటీ చేసే పార్టీల గెలుపును కొన్ని కులల డిసైడ్ చేస్తాయి. ఆ కులాలు ఏ పార్టీ కైతే మద్దతు (Caste Politics Support) ఇస్తాయో ఆ పార్టీలే గెలుస్తాయని అంత చెపుతుంటారు..అలాగే జరుగుతుంటుంది కూడా. ప్రస్తుతం ఏపీ రాజకీయాలు కాకా మీద ఉన్నాయి. చంద్రబాబు అరెస్ట్ ముందు వరకు ఓ లెక్క..ఇప్పుడు ఓ లెక్క అనేలా ఉంది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ (Chandrababu Arrest) అయ్యి జైలు లో ఉండగా..బయట మాత్రం టీడీపీ శ్రేణులు ఆందోళనలో ఉన్నారు. చంద్రబాబు బయటకు వస్తారో..రారో..మరోపక్క నారా లోకేష్ ను సైతం జైల్లో పెడతారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ లోకేష్ ను కూడా అరెస్ట్ చేసి జైల్లో వేస్తే..పార్టీ పరిస్థితి ఏంటి..? పార్టీ ని నమ్ముకున్న వారి పరిస్థితి ఏంటి..? టీడీపీ (TDP) లో కొనసాగాలా..వేరే పార్టీ లో చేరాలా..? ఇలా టీడీపీ శ్రేణులు మాట్లాడుకుంటున్నారు.
మరోపక్క చంద్రబాబు అరెస్ట్ అయినా తర్వాత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వెళ్లి చంద్రబాబు తో ములాఖత్ అయ్యి..బయటకు వచ్చి రాగానే పొత్తు (TDP – Janasena Alliance) ఖరారు చేస్తూ ప్రకటన చేసాడు. చూడ్డానికి అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయంగా కనిపించినా.. బాగా స్టడీ చేసిన తరువాతనే ఆ డెసిషన్ తీసుకున్నానని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. అప్పటి వరకు జనసేన కు మద్దతు ప్రకటిస్తూ వచ్చిన కాపు వర్గ సంఘాలు (Kapu Community)..పొత్తు పెట్టుకోగానే మీము జనసేన కు మద్దతు ఇవ్వమని (Kapu Community Not Support Janasena) చెపుతూ వస్తున్నారు.
Read Also : Nara Lokesh : జగన్‌కు బెయిల్ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపిన లోకేష్
పవన్ కళ్యాణ్ సీఎం కావాలని, ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటే చూడాలని ఉందని కాపు సామాజికవర్గం అంటుంది. ఒంటరిగానే ఎన్నికల్లో పోటీ చేసి సత్తా చాటాలి కానీ మరోపార్టీ తో పొత్తు ఎందుకు అని వారంతా ప్రశ్నింస్తున్నారు. తాజాగా కాకినాడ వేదికగా కాపు మీటింగ్ జరిగింది. స్థానిక కాపు సంఘం నేతలతో పాటు చిరంజీవి, పవన్ కల్యాణ్ అభిమాన సంఘాల నేతలు హాజరైన ఆ సమావేశంలో ఓ తీర్మానం చేశారు. వచ్చే ఎన్నికల్లో జనసేన ఒంటరిగానే పోటీ చేయాలనేది ఆ తీర్మానం సారాంశం. పొత్తులు పెట్టుకుని పోటీ చేస్తే పార్టీ ఎప్పటికీ ఎదగదని ఓ ఉచిత సలహా చేసారు. టీడీపీ తోనే కాదు కదా మరే పార్టీతోనూ పొత్తు పెట్టుకోవద్దని సూచించారు. ఒకవేళ ఎవరితోనూ పొత్తుపెట్టుకోకుండా ఒంటరిగా వెళ్తే గనక.. కాపులందరూ జనసేనకే ఓటు వేసి గెలిపించుకుంటామని చెప్పుకొచ్చారు.
వీరి వ్యాఖ్యలపై కొంతమంది అభిమానులు , కాపులోని మరికొంతమంది, ఇతర కులస్థులు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుంటే మద్దతు ఇవ్వమని , మరో పార్టీ తో పొత్తు పెట్టుకోవద్దని చెపుతున్నారు. మరి గత ఎన్నికల్లో ఏంచేశారు అని వారంతా ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం జగన్ టీంలో ఉన్న వారిలో మీ కాపు నేతలు కూడా ఉన్నారు కదా..మరి గత ఎన్నికల్లో ఎందుకు మీ కాపు నేతలు పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ చేయలేదు.? మా కులం వాడే కదా..మావాడ్నే గెలిపించుకుందాం అని ఎందుకు అనలేదు..? కనీసం పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు స్థానాల్లో కూడా ఎందుకు గెలిపించుకోలేకపోయారు..? అప్పుడు మీకు కులం గుర్తు రాలేదా..? లేక పవన్ గుర్తుకు రాలేదా..? సరే అప్పుడు అయిపోయింది..మరి ఇప్పుడేం చేస్తున్నారు..? పవన్ కళ్యాణ్ ను ప్రతి రోజు తిట్ల దండకం చేసేది ఎవరు..? పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు..ప్యాకేజ్ స్టార్..దత్తపుత్రుడు అని పదే పదే వ్యక్తిగతంగా టార్గెట్ చేసేది ఎవరు..? అని మిగతా కులస్థులు , అభిమానులు..కాపు సంఘాలను ప్రశ్నిస్తున్నారు.
Read Also : KCR Strategy: గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ దూకుడు.. బుజ్జగింపులు, చేరికలపై కేసీఆర్ గురి!
ఇంతవరకు మీ కులం నుండి సీఎం అభ్యర్థి (Kapu CM Candidate ) అయినవారు లేరు కదా..ఈసారి ఆ అవకాశం ఎందుకు మీరు తీసుకోకూడదు..అని వారు ప్రశ్నిస్తున్నారు. అసలు పవన్ కళ్యాణ్ కు కుల పిచ్చి అనేది ఉన్నదా..? ఏనాడైనా ఆలా ప్రవర్తించాడా..? ఆయన ఎంతోమందికి సాయం చేసాడు కదా..ఆలా మీ కులం వారికే చేశాడా..? అసలు కాపు మద్దతు నాకే ఉంటుందని ఎప్పుడైనా చెప్పాడా..? ఎందుకు ఆయనకు మీరు మద్దతు ఇవ్వరు..? ఏంచేసాడని ఇవ్వరు..? పొత్తు పెట్టుకుంటే ఎందుకు ఇవ్వరు అని సగటు అభిమాని..ఇతర కుల వర్గాల వారు కాపు సంఘాలను ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఏపీ పరిస్థితి ఎలా ఉందొ చూస్తున్నాం..రోడ్లు లేవు..ఉద్యోగాలు లేవు..టాక్స్ ల పేరుతో దోపిడీ..ఇసుక దోపిడీ..ఎక్కడ లేని చార్జీలు రాష్ట్రంలో వసూళ్లు చేస్తున్నారు..ప్రతి దానికి పన్ను వేస్తున్నారు..ఇంత చేస్తున్న జగన్ ను గద్దె దించాలని..అందుకు జనసేన సింగిల్ గా పొతే కుదరదని..టీడీపీ , బిజెపి తో కలిసి వెళ్తే జగన్ ను ఎదురించి వచ్చని పవన్ క్లియర్ గా చెపుతున్నాడు. ఆలా చెపుతున్నప్పుడు కూడా అర్ధం చేసుకోపోతే ఎలా అని వారంతా వాపోతున్నారు. మరి ఎన్నికల సమయం నాటికీ కాపు నేతలు..జనసేన కు సపోర్ట్ ఇస్తారా..? లేదా అనేది చూడాలి.