Kapu Community : కాపు జాతి మొత్తాన్ని పవన్ అవమానించాడు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫై కాపు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి కాపు వ్యక్తి సీఎం కాబోతున్నాడని..ఈసారి కాపులంతా పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ చేయాల్సిందే అని మొన్నటి వరకు మాట్లాడుకున్న వారు..ఇప్పుడు కాపు జాతి మొత్తాన్ని పవన్ అవమానపరిచాడంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణం అసెంబ్లీ ఎన్నికల్లో 24 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించడమే. గత ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన జనసేన..ఈసారి ఎలాగైనా విజయం సాధించాలని పట్టుదలతో […]

Published By: HashtagU Telugu Desk
Kapu Fire Pawan

Kapu Fire Pawan

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫై కాపు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి కాపు వ్యక్తి సీఎం కాబోతున్నాడని..ఈసారి కాపులంతా పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ చేయాల్సిందే అని మొన్నటి వరకు మాట్లాడుకున్న వారు..ఇప్పుడు కాపు జాతి మొత్తాన్ని పవన్ అవమానపరిచాడంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణం అసెంబ్లీ ఎన్నికల్లో 24 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించడమే. గత ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన జనసేన..ఈసారి ఎలాగైనా విజయం సాధించాలని పట్టుదలతో ఉంది. ఓటమి తర్వాత కూడా పవన్ ప్రజల్లోకి వెళ్లడం..కౌలు రైతులను ఆదుకోవడం వంటివి చేస్తూ వస్తుండడం తో ప్రజల్లో నమ్మకం పెరిగింది. ఎలాంటి పదవి , అధికారం లేనప్పుడే పవన్ ఇంత సాయం చేస్తూ వస్తున్నాడు..గెలిపిస్తే ఇంకెంత సాయం చేస్తాడో అని మాట్లాడుకున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ క్రమంలో టీడీపీ తో జనసేన పొత్తు పెట్టుకోబోతుందని తెలిసినప్పటి నుండి కాస్త జనసేన హావ తగ్గడం మొదలైంది..టీడీపీ తో పొత్తు పెట్టుకుంటున్నట్లు పవన్ అధికారికంగా ప్రకటించేసరికి చాలామంది జనసేన నుండి బయటకు వచ్చారు. సరే పొత్తు పెట్టుకున్న 175 స్థానాల్లో చేరిసగం తీసుకుంటారని మొన్నటి వరకు అంత భావించారు. కానీ నిన్న 94 స్థానాల్లో టీడీపీ , 24 స్థానాల్లో జనసేన బరిలోకి దిగబోతుందని తెలుపడం తో జనసేన శ్రేణుల్లో, కాపు సంఘాల వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన పవన్ (Pawan Kalyan) వెంటనే స్పందించాలని కాపు సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. 24 సీట్లు మాత్రమే ఇస్తానంటే జనసేనకు కాపు జాతి సహకరించదంటూ హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గాల్లో తీవ్రస్థాయిలో రగిలిపోతున్నారు. పవన్ కళ్యాణ్ ని చంద్రబాబు వాడుకుని వదిలేస్తాడని, సీట్ల సంఖ్య పెంచకపోతే టీడీపీకి (TDP) ఓటు వేసేదే లేదని తేల్చి చెబుతున్నారు.

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 11 సీట్లు ఉండగా టీడీపీకి-9, జనసేనకు-2 ప్రకటించండం, కోనసీమ జిల్లా పి.గన్నవరంలో టీడీపీ టికెట్ మహాసేన రాజేష్‌కి ఇవ్వడంపై లోకల్ క్యాడర్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేట టికెట్ జ్యోతుల నెహ్రుకు (Jyothula Nehru) కేటాయించడంతో జనసేన ఇన్‌ఛార్జ్‌ పాటంశెట్టి సూర్యచంద్ర (Patamsetti Suryachandra) ఏకంగా నిరాహార దీక్ష మొదలుపెట్టారు. ఇలా రాష్ట్రంలోని అనేక నియోజకకవర్గాల్లో జనసేన ఫై తిరుగుబాటు మొదలుపెట్టారు. మరి వీరందర్నీ పవన్ ఎలా కూల్ చేస్తాడో చూడాలి.

Read Also : Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కు బాబు వెన్నుపోటు ..

  Last Updated: 25 Feb 2024, 02:36 PM IST