Chandrababu : చంద్రబాబు నిజంగా ఓ విజన్ – ఇన్వెంటస్ ఎండి కన్వాల్ రేఖీ

ఒకప్పుడు హైదరాబాద్ లో నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంలో హైటెక్ సిటీ ని కట్టించి..అక్కడి రూపురేఖలు మార్చారని..ఐటీ ని తీసుకొచ్చి ఎంతమందికి ఉపాధిని కల్పించారని

  • Written By:
  • Publish Date - September 18, 2023 / 05:06 PM IST

చంద్రబాబు అరెస్ట్ (Chandrababu Arrest) ఫై ప్రతి ఒక్కరు స్పందిస్తున్నారు. రాజకీయ పార్టీలతో సంబంధం లేని వారు , బిజినెస్ వర్గాల వారు..ఇతర దేశాల పలు సంస్థల అధినేతలు సైతం చంద్రబాబు అరెస్ట్ ను ఖండిస్తూ..ఆయనకు మద్దతు తెలుపుతున్నారు. మరోపక్క సామాన్య ప్రజలు, ఐటీ ఉద్యోగులు ఇలా ప్రతి ఒక్కరు రోడ్ల పైకి వచ్చి తమ నిరసనలను తెలుపుతూ..బాబు కు సంఘీభావం చెపుతున్నారు. ఇక సోషల్ మీడియా లో అయితే I’M WITH CBN అంటూ హ్యాష్ టాగ్ ను వైరల్ చేస్తున్నారు.

అలాగే సోషల్ మీడియా వేదికగా పలువురు దిగ్గజ వ్యక్తులు సైతం స్పందిస్తున్నారు. తాజాగా లింకెడిన్ లో చంద్రబాబు అరెస్ట్ పోస్ట్ చూసి ప్రపంచ ఆర్థిక నిపుణుడు, ఇన్వెంటస్ ఎండి కన్వాల్ రేఖీ (Kanwal Rekhi).. స్పందించారు. చంద్రబాబు ఓ విజన్ అని..ఒకప్పుడు హైదరాబాద్ లో నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంలో హైటెక్ సిటీ ని కట్టించి..అక్కడి రూపురేఖలు మార్చారని..ఐటీ ని తీసుకొచ్చి ఎంతమందికి ఉపాధిని కల్పించారని..హైదరాబాద్ ను ఐటీ హబ్ గా మార్చిన చరిత్ర చంద్రబాబుది అని, సైబరాబాద్ నిర్మాణంలో చంద్రబాబు గారి పాత్ర, పెట్టుబడుల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆయన పడే తపన రియల్ గ్రేట్ అంటూ చెప్పుకొచ్చారు.

Read Also : Tomato Price: మరింత దిగజారిపోయిన టమాటా ధర.. కిలో ధర తెలిసి గుండెలు బాదుకుంటున్న రైతన్నలు?

అలాగే చంద్రబాబు ఎంత విజనో తెలుపుతూ చంద్రబాబుతో జరిగిన ఓ సంఘటనను గురించి గుర్తు చేసారు. హైద్రాబాద్లో ఓ సారి విదేశీ సంస్థల దిగ్గజాలతో కలిసి సమావేశాలు జరిపిన సమయంలో చంద్రబాబు గారు..ఆ టైములో దుబాయ్ లో ఉన్నారు. నెక్స్ట్ డే ఢిల్లీ కి మీము చేరుకోవాలి. ఆ టైం లో చంద్రబాబు గారు ఫోన్ చేసి..ఈరోజు ఇక్కడే ఉండమని..నేను వస్తున్నాను..నెక్స్ట్ డే మార్నింగ్ మీరు వెళ్ళొచ్చున్నారు. మీము సరే అని చెప్పం..తెల్లారి ఉదయం 4 కల్లా మా దగ్గరికి వచ్చి రాష్ట్ర భవిష్యత్తు కోసం, యువత భవిష్యత్ కోసం, పలు విషయాలను చర్చించి..ఆ తర్వాత తమను ఎయిర్ పోర్ట్ వరకు పోలీస్ సిబ్బంది తో పంపించారని..అలాంటి విజన్ భారతదేశంలో ఉండడం నిజంగా గ్రేట్ అని , అలాంటి వారు మరొకరు లేరంటూ చంద్రబాబు ను ఆకాశానికి ఎత్తారు కన్వాల్ రేఖీ.