భారతీయ జనతా పార్టీ (BJP) మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఫిబ్రవరి 23న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీ (TDP)లో చేరనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఫిబ్రవరి 16న బీజేపీకి రాజీనామా లేఖను పంపిన లక్ష్మీనారాయణ.. తన అనుచరులతో అత్యవసర సమావేశం నిర్వహించి పార్టీ నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ పనితీరుపై ఆయన అసంతృప్తిగా ఉన్నారు. రాష్ట్రంలో పార్టీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పార్టీ వ్యవహారాలను తన సొంత సంస్థలాగా నడిపిస్తున్నారని, పార్టీలో పరిస్థితులు మారిపోయాయని ఆరోపించారు.
Also Read: Earthquake: పల్నాడు జిల్లాలో భూకంపం.. భయాందోళనలో స్థానికులు
గత కొంతకాలంగా కన్నా లక్ష్మీనారాయణ బీజేపీపై అసంతృప్తితో ఉన్నారు. బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజుపై విమర్శలు చేశారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతం కాకపోవడానికి సోము వీర్రాజు వైఖరే కారణమని విమర్శలు చేశారు. జనసేనను బీజేపీ నాయకత్వం వైఖరితో జనసేన అసంతృప్తితో ఉందని కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు. బీజేపీలో ఉంటే తనకు ఇబ్బందికర పరిస్థితులుండే అవకాశం ఉందని భావించి కన్నా లక్ష్మీనారాయణ.బీజేపీకి గుడ్ బై చెప్పారు. టీడీపీ కన్నాకు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. అయితే, కన్నా లక్ష్మీనారాయణ ఇవాళ తన ముఖ్య అనుచరులతో సమావేశమై, పార్టీలో చేరికపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.