Kanna Lakshminarayana: బీజేపీకి కన్నా లక్ష్మీనారాయణ గుడ్ బై!

భారతీయ జనతా పార్టీ (BJP)కి (Kanna Lakshminarayana) రాజీనామా చేశారు. లేఖను నడ్డాకు మెయిల్ ద్వారా పంపారు.

Published By: HashtagU Telugu Desk
Kanna

Kanna

భారతీయ జనతా పార్టీ (BJP)కి సీనియర్ నాయకులు ఆ పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ  (Kanna Lakshminarayana) రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డాకు మెయిల్ ద్వారా పంపారు. సోము వీర్రాజు కక్ష సాధింపులు కుటిల రాజకీయాలు వల్లే పార్టీని వీడుతున్నానని స్పష్టం చేశారు. 2014లో బిజెపిలో చేరానని ఆ రోజు నుంచి పార్టీ అభ్యున్నతికి పార్టీ ప్రతిష్టకు కృషి చేశానని,  2019లో 175 స్థానాల్లో అభ్యర్థులు నిలబెట్టగలిగాను అని కన్నా అన్నారు.

అదే సమయంలో పాలక ప్రతిపక్ష పార్టీల నుంచి మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలను పార్టీలోకి తీసుకువచ్చేలా చేశానని (Kanna Lakshminarayana) అన్నారు. పదవుల కోసం ఎప్పుడూ పనిచేయలేదు.. పనిచేస్తుంటే పదవులు వాటి అంతట అవే వస్తాయని ఆయన అన్నారు. జివిఎల్ నరసింహారావు ఓవర్ నైట్ లో నాయకుడిగా ఎదగాలని కోరుకుంటున్నాడని, భవిష్యత్తు కార్యాచరణను కొద్ది రోజుల్లోనే ప్రకటిస్తానని కన్నా తెలియజేశారు. అయితే కన్నాతో (Kanna Lakshminarayana) పాటు మరి కొంతమంది రాజీనామా చేసే అవకాశాలున్నాయి. కన్నా లక్ష్మీనారాయణ వాహనానికి ఉన్న బీజేపీ జెండానులోపల ఉన్న కమలం గుర్తును తీసివేశారు.

Also Read: Underwater Kisses: అండర్ వాటర్ లో ముద్దులు.. రికార్డుకెక్కిన ప్రేమికులు!

  Last Updated: 16 Feb 2023, 02:57 PM IST