అరుదైన రికార్డ్ సాధించిన కాణిపాకం దేవస్థానం.. ఆలయానికి ఐఎస్‌ఓ సర్టిఫికెట్‌

Sri Kanipakam Varasiddhi Vinayaka Temple : చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక ఆలయానికి ఐఎస్ఓ సర్టిఫికెట్ లభించింది. భక్తులకు అందిస్తున్న సేవలు, ఆలయ నిర్వహణ, పరిశుభ్రత వంటి అంశాలను పరిశీలించి హైదరాబాద్‌కు చెందిన హైమ్‌ సంస్థ ఈ గుర్తింపును అందించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా కాణిపాకం ఆలయానికి క్యూ త్రీస్టార్‌ రేటింగ్‌ దక్కింది. ఇది ఆలయ అధికారులు, సిబ్బంది కృషికి దక్కిన గౌరవం అంటున్నారు. చిత్తూరు జిల్లాలోని కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి […]

Published By: HashtagU Telugu Desk
Kanipakam temple

Kanipakam temple

Sri Kanipakam Varasiddhi Vinayaka Temple : చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక ఆలయానికి ఐఎస్ఓ సర్టిఫికెట్ లభించింది. భక్తులకు అందిస్తున్న సేవలు, ఆలయ నిర్వహణ, పరిశుభ్రత వంటి అంశాలను పరిశీలించి హైదరాబాద్‌కు చెందిన హైమ్‌ సంస్థ ఈ గుర్తింపును అందించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా కాణిపాకం ఆలయానికి క్యూ త్రీస్టార్‌ రేటింగ్‌ దక్కింది. ఇది ఆలయ అధికారులు, సిబ్బంది కృషికి దక్కిన గౌరవం అంటున్నారు.

చిత్తూరు జిల్లాలోని కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి ఆలయానికి ప్రత్యేక గుర్తింపు లభించింది. ఈ ఆలయం భక్తులకు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ఐఎస్‌ఓ సర్టిఫికెట్ లభించింది. ఆలయ నిర్వహణ, క్యూలైన్ల పర్యవేక్షణ, పాలనా వ్యవస్థ, ప్రసాదం, అన్నదానం తయారీ, పరిశుభ్రత, పడితరం స్టోర్స్ నిర్వహణ తదితర అంశాలను పరిశీలించి, ఇవి ఐఎస్‌ఓ నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయని నిర్ధారించిన తర్వాత ఈ సర్టిఫికెట్ ఇచ్చారని తెలిపారు.

శ్రీవరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో పైన పేర్కొన్న అంశాలు ఐఎస్‌ఓ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని హైదరాబాద్‌కు చెందిన హైమ్ (HYME) సంస్థ నిర్ధారించింది. దీంతో సర్టిఫికెట్ ఇచ్చారు. ఐఎస్‌ఓ గుర్తింపు ధ్రువపత్రాలను హైమ్ సీఈవో, పూతలపట్టు ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్, ఛైర్మన్‌ ఎం. మణినాయుడు, ఈవో పెంచల కిశోర్‌కు బుధవారం అందజేశారు. ఆలయంలో సేవల నాణ్యతను గుర్తించి రెండు తెలుగు రాష్ట్రాల్లో తొలిసారి కాణిపాకం ఆలయానికి క్యూ త్రీస్టార్‌ రేటింగ్‌ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఆలయ అధికారులు, సిబ్బంది కృషి కారణంగా ఆలయానికి ఈ ఘనత లభించిందన్నారు.

ఇదిలా ఉంటే, ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లోని పలు ఆలయాలకు ఐఎస్‌ఓ సర్టిఫికెట్ లభించింది. శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానానికి 7 విభాగాలలో ఐఎస్‌ఓ సర్టిఫికెట్లు లభించాయి. అలానే సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానానికి ఐఎస్‌ఓ సర్టిఫికెట్ లభించింది. దీంతో పాటు, అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయానికి కూడా ఐఎస్‌ఓ సర్టిఫికెట్ లభించింది.

అన్నవరం ఆలయానికి సంబంధించి సత్యదేవుడి ప్రసాదంతో పాటు, ఈ ఆలయంలో భక్తులకు అందిస్తున్న సేవలకు గాను రెండు విభాగాల్లో ఈ గుర్తింపు లభించింది. శ్రీ భద్రకాళి వీరేశ్వర స్వామి క్షేత్రం, విశాఖపట్నంలోని కనక మహాలక్ష్మి ఆలయం, శ్రీకాళహస్తి దేవస్థానాలు ఐఎస్‌ఓ సర్టిఫికెట్ పొందిన జాబితాలో ఉన్నాయి.

ఐఎస్‌ఓ అనేది ఒక అంతర్జాతీయ ప్రమాణాల సంస్థ. ఏదైనా ఒక సంస్థ లేదా ఉత్పత్తి భద్రత, నాణ్యత, సామర్థ్యం, పనితీరు వంటి అంశాలు ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని ధృవీకరించడానికి ఈ గుర్తింపు పత్రాన్ని అందిస్తుంటారు. అయితే, ఆలయాలకు ఐఎస్‌ఓ ధ్రువీకరణ లభించడం అంటే ఆయా ఆలయాల్లో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు పరిశుభ్రమైన, నాణ్యమైన ప్రసాదం మరియు పారదర్శకమైన నిర్వహణ అందుతున్నాయని తెలియజేస్తుంది.

  Last Updated: 01 Jan 2026, 12:55 PM IST