Mangalagiri Kandru Kamala : మంగళగిరి వైసీపీ అభ్యర్ధిగా కాండ్రు కమల..?

  • Written By:
  • Publish Date - February 15, 2024 / 04:44 PM IST

ఏపీలో అధికార పార్టీ వైసీపీ (YCP) గందరగోళానికి గురి అవుతుందా..? ఎలాగైనా గెలవాలనే ఆశతో అందర్నీ దూరం చేసుకుంటుందా..? సలహాలు ఇచ్చేవారు ఎక్కువ అవుతుండం జగన్ (Jagan) అయోమయానికి గురి అవుతున్నాడా..? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. గత ఎన్నికల్లో భారీ మెజార్టీ తో విజయం సాధించిన వైసీపీ..ఈసారి గెలుపు కాస్త అటు ఇటుగానే ఉండేలా ఉందని సంకేతాలు అందుతుండడం తో ఎలాగైనా గెలిచి తీరాలని చూస్తున్నాడు. ఇందుకోసం అనేలా మార్పులు చేర్పులు చేస్తూ..పార్టీలోని నేతలను దూరం చేసుకుంటున్నాడు.

ఇప్పటికే సర్వేల ఆధారంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్స్ ఇవ్వకపోవడం తో వారంతా బయటకు వస్తున్నారు. ఇక ఇప్పుడు నియోజకవర్గాల ఇంచార్జ్ లను మారుస్తూ వారిలో ఆగ్రహం పెంచుతున్నారు. తాజాగా మంగళగిరి ఇంచార్జ్ గంజి చిరంజీవి (Mangalagiri Incharge is Ganji Chiranjeevi) ని మార్చే ఆలోచనలో జగన్ ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక్కడ రెండు సార్లు వైసీపీ నుంచి గెలిచి జగన్‌కు అత్యంత సన్నిహితుడిగా ముద్రపడ్డ ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) వైసీపీని వీడటం అందర్నీ షాక్ కు గురి చేసింది. మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్న క్రమంలో ఆర్కే ను జగన్ దూరం పెట్టడం తో ఆయన పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ గూటికి చేరారు.

We’re now on WhatsApp. Click to Join.

ఆర్కే పార్టీని వీడటంతో వెంటనే స్థానికుడు, పద్మశాలి సామాజికవర్గానికి చెందిన గంజి చిరంజీవిని జగన్ ఇన్‌ఛార్జ్‌గా నియమించారు. చిరంజీవి ద్వారా మంగళగిరిలో పెద్ద సంఖ్యలో వున్న పద్మశాలి, ఇతర బీసీ ఓట్లు వైసీపీకేనని .. దీనికి తోడు పార్టీని తొలి నుంచి అంటిపెట్టుకుని వున్న రెడ్డి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల ఓట్లు తమకే పడతాయని జగన్ అంచనా వేసుకున్నారు. చిరంజీవి సైతం టికెట్ తనకే అని ప్రచారం మొదలుపెట్టాడు. ఈ సమయంలో గంజి చిరంజీవికి జగన్ షాక్ ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. చిరంజీవి ప్లేస్‌లో మంగళగిరి మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల (Kandru Kamala)ను నియమించినట్లుగా ప్రచారం జరుగుతోంది. జగన్ చేయించిన సర్వేలో చిరంజీవి పరిస్ధితి ఏమాత్రం బాలేదని.. లోకేష్‌ను ఓడించే పరిస్ధితులు కనిపించడం లేదని తేలడంతో వైసీపీ చీఫ్ పునరాలోచనలో పడ్డట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కమలను తెరపైకి తెచ్చినట్లుగా ప్రచారం అవుతుంది. మరి నిజంగా చిరంజీవి ని పక్కకు పెడతారా..? కమల కు టికెట్ ఇస్తారా అనేది ఏడో లిస్ట్ వస్తే తెలుస్తుంది. ఒకవేళ చిరంజీవి ని తప్పిస్తే..నెక్స్ట్ ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Read Also : Bandi Sanjay : కేసీఆర్ కుటుంబం నుంచి ఆస్తులు జఫ్తు చేయాలిః బండి సంజయ్ డిమాండ్