Site icon HashtagU Telugu

Chandrababu: టీడీపీకి కంచుకోట కుప్పం నియోజకవర్గం: చంద్రబాబు నాయుడు

CBN Tour

chandrababu naidu sabha stampede

Chandrababu: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. చిత్తూరు జిల్లాలో రెండో రోజు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.‘‘ తెలుగుదేశానికి కుప్పం నియోజకవర్గం కంచుకోట. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే కుప్పం అభివృద్ధి జరిగింది. కుప్పం ప్రాంతానికి ఏం చేశారని వైకాపా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. తెదేపా అధికారంలో ఉంటే హంద్రీనీవా ద్వారా ప్రతి ఎకరాకు నీళ్లిచ్చేవాళ్లం. హంద్రీనీవాను పూర్తి చేయడానికి రాత్రింబవళ్లు కష్టపడ్డాం’’ అని చంద్రబాబు అన్నారు.

మేము 87 శాతం పనులు పూర్తి చేస్తే.. 13 శాతం పూర్తి చేయని దద్దమ్మ ప్రభుత్వమిది. వైకాపా ప్రభుత్వానికి ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచనే లేదు అని మండిపడ్డారు. దోపిడీ.. గజ దొంగలు.. రాష్ట్రాన్ని దోచుకోవడానికే అధికారంలోకి వచ్చారని, వైసీపీ ప్రభుత్వంలో ప్రాజెక్టులను పట్టించుకున్న పాపాన పోలేదని చంద్రబాబు ఆరోపించారు. రైతులను ప్రోత్సహించేందుకు ఏ కార్యక్రమమైనా చేపట్టారా?’’ అని జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

కాగా అంతకుముందు కుప్పం ఆర్‌అండ్‌బీ అతిథి గృహం వద్ద ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. అనంతరం శాంతిపురం నుంచి ర్యాలీ నిర్వహించగా.. తెదేపా కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున పాల్గొన్నారు. చంద్రబాబు రేపు కూడా కుప్పంలో పర్యటించబోతున్నారు.

Also Read: Prabhas-Maruthi: ప్రభాస్-మారుతి మూవీ ఫస్ట్ లుక్, టైటిల్ రిలీజ్ ఎప్పుడు తెలుసా