మొన్నటి వరకు గుడివాడలో కొడాలి నాని (Kodali Nani) అరాచకాలను , దోపిడీలను చూసి విసిగి పోయిన జనాలు..ఆయన్ను ఓడిస్తే.. ఇప్పుడు మరో నాని అవతరించాడని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ (YCP) హయాంలో అతడికి అడ్డూ అదుపూ లేదు. సీఐడీ మాజీ చీఫ్, అత్యంత వివాదాస్పద ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ (Sunil Kumar) కు నమ్మినబంటుగా వ్యవహరించాడు. అంతేకాదు ప్రస్తుత ఉపసభాపతి రఘురామకృష్ణరాజును సీఐడీ కస్టడీలో చిత్రహింసలు పెట్టిన కేసులో ఆరో నిందితుడుగా ఉన్నాడు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఇతడి అరాచకాలకు అడ్డుకట్టపడుతుందని అంతా భావించారు. కానీ గుడివాడ కేంద్రంగా అతడు పేట్రేగిపోవడం ఇప్పుడు అందర్నీ షాక్ కు గురి చేస్తుంది. ఆరేడు నెలలుగా తులసి గ్యాంగ్ అరాచకాలు అన్ని ఇన్ని కావు. దోపిడీలు , దౌర్జన్యాలు కోసాగిస్తు రౌడీ గ్యాంగ్ ను పెంచి పోషిస్తున్నాడు. ఇంతకీ ఎవరా అనుకుంటున్నారా..? అతడే తులసిబాబు (Kamepalli Tulasi Babu).
HMDA Land Auction : హెచ్‌ఎండీఏ భూముల వేలం..ఈసారి సామాన్యులకు..!!
కామేపల్లి తులసీబాబు ఇప్పుడు గుడివాడ(Gudivada)లో అన్ని వ్యవహారాల్లో వేలు పెడుతూ షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు. తులసీబాబు అసెంబ్లీ ఎన్నికలకు ముందు గుడివాడకు చేరుకొని వెనిగండ్ల రాము విజయంలో కీలక పాత్ర పోషించాడు. అంతకు ముందు నుండే రాము తో ఉన్న సంబంధం..ఎన్నికల్లో రాము గెలుపుకు క్రియాశీలకంగా వ్యవహరించడం తో తులసీబాబు కు అడ్డు అదుపులేకుండా పోతుంది. గత కొద్దీ నెలలుగా గుడివాడలో వసూళ్లు ఇతర వ్యవహారాలన్నీ ఆయనే చూసుకుంటున్నారు. ఇటీవల ఆయనను ప్రకాశం జిల్లా పోలీసులు అరెస్టు చేసి గుంటూరు జిల్లా జైలుకు తరలించినప్పుడు స్వయంగా వెనిగండ్ల రాము వెళ్లి గంట సేపు మాట్లాడి రావడం తో ప్రజలు మరో రకంగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. మొన్నటి వరకు కొడాలి నాని తో ఇబ్బంది పడ్డామని..ఇప్పుడు తులసి బాబు తో మళ్లీ ఇబ్బందులు మొదలయ్యాయని వారంతా వాపోతున్నారు. గుడివాడలోఇప్పుడు తులసిబాబు ఓ అరాచకశక్తిగా మారాడని అంటున్నారు. త్వరగా అధిష్టానం తులసి బాబు పై చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.