Pawan Kalyan : నిన్ను చూసి గర్విస్తున్నా సోదరా అంటూ పవన్ కళ్యాణ్ కు కమల్ హాసన్ ట్వీట్

ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా సేవ చేసేందుకు బయలుదేరిన పవన్ కు శుభాకాంక్షలు చెప్పా. నిన్ను చూసి గర్విస్తున్నా సోదరా

Published By: HashtagU Telugu Desk
Kamal Haasan Tweet To Pawan

Kamal Haasan Tweet To Pawan

పిఠాపురం ఎమ్మెల్యే గా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) భారీ మెజార్టీ తో విజయం సాధించడం..జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయ డంఖా మోగించడం తో జనసేన శ్రేణులే కాదు చిత్రసీమ ప్రముఖులు సైతం సంబరాలు చేసుకుంటున్నారు. పదేళ్లుగా పవన్ కళ్యాణ్ ఎంత కష్టపడుతున్నాడో తెలియంది కాదు..గత ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్ల ఓటమి చెందారు. అయినప్పటికీ రాజకీయాలను వదిలిపెట్టకుండా సినిమాల ద్వారా వచ్చిన డబ్బును సైతం ప్రజలకే పంచుతూ అందరిలో నమ్మకం కలిగించారు. రాష్ట్రం బాగుపడాలంటే కూటమి గా ఏర్పడి జగన్ ను ఓడించాలని టీడీపీ , బిజెపి ని కలిపి..తన స్థానాలను సైతం తగ్గించుకొని ఈరోజు రాష్ట్రంలో కూటమిని గెలిపించారు. ఇలా పవన్ విజయానికి అంత అభినందనలు తెలియజేస్తూ వస్తున్నారు. అంతే కాదు ‘పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా’ అంటూ సినీ ప్రముఖులు సైతం తమ ఆనందాన్ని తెలియజేస్తూ వస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ క్రమంలో తాజాగా విలక్షణ నటుడు కమల్ హాసన్ (Kamal Haasan)..జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కంగ్రాట్స్ తెలిపారు. ‘పవన్ తో భావోద్వేగ సంభాషణ జరిగింది. ఎన్నికల్లో ఘన విజయంపై హృదయపూర్వక అభినందనలు తెలియజేశా. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా సేవ చేసేందుకు బయలుదేరిన పవన్ కు శుభాకాంక్షలు చెప్పా. నిన్ను చూసి గర్విస్తున్నా సోదరా’ అంటూ కమల్ హాసన్ ట్వీట్ చేశారు. అలాగే సినీ నటి మాదవి లత సైతం నేను ”పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా” అంటూ పోస్ట్ చేసి అభిమానుల్లో సంతోషం నింపింది. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ‘పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా’ అనే నెంబర్ ప్లేట్ బోర్డు ఫొటోను షేర్ చేసింది. అంతేకాదు, ‘మీరు కూడానా’ అంటూ తన ఫాలోవర్లను ప్రశ్నించింది.

Read Also : Jawahar Reddy : ఏపీ మాజీ సీఎస్ జవహర్ రెడ్డికి సెలవు మంజూరు

  Last Updated: 07 Jun 2024, 11:24 PM IST