ఇక జనంతోనే నా అడుగులుంటున్నారు ఎస్.ఆర్. కన్ స్ట్రక్షన్స్ అధినేత అమిలి నేని సురేంద్రబాబు (Amilineni Surendra Babu). సురేంద్ర బాబు అంటే అనంతపురం జిల్లా (Anantapur District)లో తెలియనివారుండరు. రాజకీయాల్లోకి రాకముందే ప్రజాసేవలో తనదైన ముద్రవేసిన అమిలినేని ప్రజల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు. కరోనా సమయంలో ..అనంతపురం జిల్లాలో దాదాపు కోటి రూపాయల ఖర్చుతో తన టీమ్ తో శానిటైజర్లు, మాస్క్ లు, గ్లౌజులు, ఆక్సిజన్ సిలిండర్లు, పేదవాళ్ల ఇంటికి నిత్యావసరాలు, కరోనా మందుల కిట్లు ఇవన్నీ పంపిణీ చేసి తన గొప్ప మనసును చాటుకున్నారు. ఇంతాచేసిన కానీ ఎప్పుడు ప్రచారం చేసుకోలేదు.. తనదైన శైలిలో ప్రజాసేవ చేసుకుంటూ ముందుకెళ్లారు.
అనంతపురంలో రైల్వే పాత బ్రిడ్జిని పడగొట్టి, ఒక్క ఏడాదిలోగా కొత్తది కట్టి రికార్డ్ సృష్టించిన కాంట్రాక్టర్ గా అందరికీ ఆయన సుపరిచితం. ఇన్నాళ్లూ అనంతపురం జిల్లాలో టిడిపి పార్టీ సాధించిన విజయాల్లో అలిమినేని పాత్ర ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇన్నాళ్లూ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించిన అమిలినేని సురేంద్రబాబు 2024లో నేరుగా కళ్యాణ దుర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
రెండు దశాబ్దాలకు పైగా టిడిపికి సేవలందిస్తున్నారు. అంతేకాదు పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు (Chandrababu) కు అత్యంత సన్నిహితునిగా ఉన్నారు. అలాగే పార్టీ జాతీయ కార్యదర్శి లోకేషుతో కూడా సురేంద్రబాబుకి ఆత్మీయానుబంధం ఉంది. నియోజకవర్గంలో చంద్రబాబు పలు దఫాలు జరిపిన సర్వేలో కూడా సీనియర్లను కాదని సురేంద్రబాబుకే ప్రజల మద్దతు లభించింది. గత రెండుసార్లు పార్టీ టికెట్ ఇవ్వకున్నా పార్టీ కోసం నిబద్దతగా పనిచేయడమే కూడా ఆయనకు అనుకూలం గా మారింది. ఇప్పటివరకు కాంట్రాక్టరుగా ఉన్నాను, క్షణం తీరిక లేకుండా పరుగెత్తాను… ఇక చాలు, ఇక నుంచి మనసుకి ఆత్మ సంతృప్తి కలిగే పని చేయాలని భావించి, వ్యాపార వ్యవహారాలన్నింటికి రాజీనామా చేశాను. స్వచ్ఛందంగా రాజకీయాల్లో అడుగు పెట్టానని సురేంద్రబాబు చెబుతున్నారు. ప్రస్తుతం కళ్యాణ దుర్గం (Kalyandurgam ) మకాం మర్చి నూతనంగా ఇల్లు కూడా కడుతున్నారు. ఇక్కడ నుంచి ప్రతిరోజు నియోజకవర్గంలోనే ఉండి, ప్రజలకు అందుబాటులో ఉంటానని చెబుతున్నారు. వారికే కష్టం వచ్చినా అండగా ఉంటానని చెబుతున్నారు.
రహదారి సౌకర్యం లేక స్థానికంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలిసి రాయలప్పదొడ్డి నుంచి బొమ్మగానిపల్లి వరకు 2 కిలోమీటర్లకి పైగా రోడ్డుని తన సొంత ఖర్చులతో వేయిస్తున్నారు. స్థానిక ప్రజల నీటి కష్టాలు చూసి ఏ పదవి లేనప్పుడే భైరవాణి తిప్పా ప్రాజెక్టు కోసం పోరాడారు..గత టిడిపి ప్రభుత్వంలో ఆ ప్రాజెక్టు పనులు మొదలుపెట్టి భూసేకరణలో సైతం కీలకపాత్ర పోషించారు. స్థానికంగా ఉన్న నీటి సమస్యపై ఓ అవగాహన ఉన్న సురేంద్రబాబు కాంట్రాక్టు బిల్లులతో సంబంధం లేకుండా 90 కిలోమీటర్ల కెనాల్ వర్క్ లో 30 కిలోమీటర్లు కెనాల్ యుద్ధప్రాతిపదికన పూర్తి చేశారు..ఒక అవకాశం ఇవ్వండి. కళ్యాణదుర్గానికి ఐదేళ్ల తర్వాత మీరేం చేశారు? అని అడగండి, అప్పుడు సమాధానం చెబుతానని ఛాలెంజ్ కూడా చేస్తున్నారు.
Read Also : Idly Vada Ram Charan : సౌత్ ఫేస్ రాం చరణ్.. అది అవమానించినట్టు కాదు.. షారుఖ్ వీడియోపై ఫ్యాన్స్ క్లారిటీ..!