Site icon HashtagU Telugu

Janasena : జనసేన అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేసిన పవన్..

Kalyan Issues B Forms To Ca

Kalyan Issues B Forms To Ca

ఏపీ అసెంబ్లీ తో పాటు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తున్న జనసేన అభ్యర్థులకు (Janasena Candidates)..పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) బీ-ఫారాలు ( B-Forms) అందజేశారు. పొత్తులో భాగంగా జనసేన పార్టీ మొత్తం 21 అసెంబ్లీ స్థానాల్లో , 2 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎన్నికల పోలింగ్ కు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈరోజు పార్టీ కార్యాలయంలో పోటీ చేస్తున్న అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేశారు. తొలి ఫారంను జనసేన కీలక నేత నాదేండ్ల మనోహర్, లోకం మాధవికి పవన్ కళ్యాణ్ అందజేశారు. తనతో సహా 20 మంది ఎమ్మెల్యే, ఇద్దరు ఎంపీ అభ్యర్థులకు బి ఫారాలను పవన్ ఇచ్చారు. పాలకొండ నుంచి జయకృష్ణ వ్యక్తిగత కారణాలతో రాలేకపోయారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ సందర్బంగా పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ గారు నిబద్దతతో నడుపుతున్నారని, ఎన్నో ఇబ్బందులు, ఆటంకాలు ఎదురైనా మొక్కవోని దీక్షతో పార్టీని నడిపారని, ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించాలని, వైసీపీని ఓడించాలనే సంకల్పంతో ఉన్నామన్నారు. సమర్ధులైన అభ్యర్థులను పవన్ ఎంపిక చేశారని , ఈ ఐదేళ్లల్లో జరిగిన దాడులు, దారుణాలు ప్రజలకు వివరించాలన్నారు. పవన్ కల్యాణ్ మనపై నమ్మకంతో అవకాశం కల్పించారని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ప్రజలకు మనమేం చేస్తామో, ఏమి చేయగలమో వివరించాలన్నారు. బీజేపీ, టీడీపీ నేతలను కలుపుకుని విజయమే లక్ష్యంగా అడుగులు వేయాలన్నారు. తప్పకుండా నవ శకానికి నాందీ పలికేలా అందరూ కలిసి పని చేయాలని కోరారు.

Read Also : Surya Tilak : అయోధ్య ఆలయంలో అద్భుతం.. బాల రాముడి నుదుటిపై సూర్యతిలకం..