చంద్రబాబు (Chandrababu) అక్రమ అరెస్ట్ కు నిరసనగా టీడీపీ పార్టీ గత కొద్దీ రోజులుగా రకరకాలుగా వినూత్న కార్యక్రమాలు చేపడుతూ చంద్రబాబుకు సంఘీభావం తెలుపుతున్న సంగతి తెలిసిందే. ‘మోత మోగిద్దాం, కాంతితో క్రాంతి, న్యాయానికి సంకెళ్లు, జగనాసుర దహనం’ కార్యక్రమాలు చేపగ్గా ఆదివారం మరో వినూత్న నిరసనకు పిలుపునిచ్చింది.
We’re now on WhatsApp. Click to Join.
రాష్ట్రంలో ‘అరాచక, చీకటి పాలన సాగిస్తోన్న జగనాసురుడికి కళ్లు తెరిపిద్దాం (Kallu Teripiddam)’ పేరిట వినూత్న నిరసనకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. ఆదివారం రాత్రి 7 గంటల నుంచి 7.05 మధ్యలో కళ్లకు గంతలు కట్టుకొని ఇళ్ల వద్దే బాల్కనీ, వీధులు, వాకిళ్లలోకి వచ్చి టీడీపీ అధినేత చంద్రబాబుకి మద్దతుగా ‘నిజం గెలవాలి’ అని గట్టిగా నినదించాలని కోరారు. లోకేష్ పిలుపుకు రాష్ట్ర ప్రజల నుండి విశేష స్పందన వచ్చింది. టీడీపీ శ్రేణులతో పాటు చాలామంది కళ్లకు గంతలు కట్టుకొని ఇళ్ల వద్దే బాల్కనీ, వీధులు, వాకిళ్లలోకి వచ్చి చంద్రబాబుకు సంఘీభావం తెలిపారు. విదేశాల్లో ఉన్న తెలుగు వారు సైతం భారత కాలమానం ప్రకారం ఆ సమయంలో నిరసన తెలిపారు.
నారా లోకేశ్ (Nara Lokesh), బ్రాహ్మణి, మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్ వద్ద , టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, సీనియర్ నేతలు దేవినేని ఉమా, నక్కా ఆనందబాబు, బోండా ఉమా తదితరులు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు.
Read Also : world cup 2023: టీమిండియా బౌలర్ల విధ్వంసం.. ఇంగ్లాండ్ కు మరో ఓటమి