Kakani Govardhan Reddy : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి మరోసారి షాక్ తగిలింది. ఇప్పటికే పలు కేసుల కేసులలో నిందితుడిగా ఉన్న ఆయనకు తాజాగా మరో కేసులో న్యాయస్థానం రిమాండ్ విధించింది. 2019 ఎన్నికల సమయంలో ముత్తుకూరు మండలం పంటపాలెం వద్ద భారీ మద్యం నిల్వ (డంపు) బయటపడిన కేసులో ఆయన పేరుతో కూడిన పీఈ వారెంట్‌పై ఎక్సైజ్ పోలీసులు కోర్టులో హాజరు పరచారు.
China-Pak : భారత్ దెబ్బతో చైనాను నమ్మలేకపోతున్న పాక్
దీంతో నెల్లూరు కోర్టు ఆయనను జూలై 17వ తేదీ వరకు రిమాండ్‌కు పంపిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే సమయంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి సంతకాన్ని ఫోర్జరీ చేసిన కేసులో ఇటీవలే కాకాణికి నెల్లూరు నాల్గో అదనపు కోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ కేసులో బెయిల్ లభించినా… ఇంకా ఆయన జైలులోనే కొనసాగుతున్నారు. దానికి కారణం, ఇంకా నలుగు ఇతర కేసుల్లో కూడా ఆయన నిందితుడిగా ఉండడమే. తాజాగా మద్యం కేసులో రిమాండ్ విధించడంతో కాకాణి గోవర్ధన్ రెడ్డి చుట్టూ చట్టపరమైన ఉచ్చు మరింత బిగుమట్టినట్టయింది.
Chhattisgarh : ఆఫీస్ కు లేటుగా వచ్చారని ఉద్యోగుల చేత గుంజీలు తీయించిన కలెక్టర్