Site icon HashtagU Telugu

Bangalore Rave Party : బెంగుళూర్ రేవ్ పార్టీ లో నేను లేను – కాకాణి గోవర్ధన్ రెడ్డి

Kakani Govardhan Reddy

Kakani Govardhan Reddy

బెంగుళూర్ రేవ్ పార్టీ (Bangalore Rave Party) అంశం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ పార్టీ లో సినీ ప్రముఖులతో పాటు రాజకీయ పార్టీల వ్యక్తులు ఉన్నట్లు తేలడం తో అంత దీనిగురించి మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికే పోలీసులు పలువురి పేర్లను సైతం ప్రకటించడం జరిగింది. కాగా ఈ పార్టీ లో కాకాణి గోవర్ధన్ రెడ్డి కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతుండడం తో ఆ ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని కాకాణి చెప్పుకొచ్చారు.

We’re now on WhatsApp. Click to Join.

నా ఆధ్వర్యంలోనే పార్టీ జరిగిందని.. నా పాస్ పోర్ట్ దొరికిందని.. గోపాల్ రెడ్డి నాకు సన్నిహితుడని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై నేను టీడీపీ నేత సోమిరెడ్డికి సవాల్ విసురుతున్న….. బ్లడ్ శ్యాంపిల్ ఇచ్చేందుకు సిద్ధం కావాలని సవాల్ చేశా.. నా పాస్ పోర్ట్ కార్లో దొరికిందని అంటున్నారు.. నా పాస్ పోర్ట్ నా దగ్గర ఉంది అని పేర్కొన్నారు. కారులో దొరికిందని చెబుతున్న పాస్ పోర్టు ఎవరి దగ్గర ఉంది.. సోమిరెడ్డి దగ్గర ఉందా.. కర్ణాటక పోలీసుల వద్ద ఉందా అని ప్రశ్నించారు. దీనికి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డే సమాధానం చెప్పాలి అని మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి ప్రశ్నించారు. కారు తుమ్మల వెంకటేశ్వర రావు పేరుతో ఉంది.. కారుకు స్టికర్ ఉందని చెప్పి నా కారు అని చెప్పడం కరెక్ట్ కాదు.

కారు తుమ్మల వెంకటేశ్వర రావు పేరుతో ఉంది.. కారుకు స్టికర్ ఉందని చెప్పి నా కారు అని చెప్పారు.. స్టికర్ పై పోలీసులకు ఫిర్యాదు చేశా.. వారు విచారణ చేస్తున్నారు.. గోపాల్ రెడ్డి అనే వ్యక్తి నాకు తెలియదు.. నాతో గోపాల్ రెడ్డికి పరిచయం ఉన్నట్టు ఏ ఆధారం ఉన్నా సోమిరెడ్డి బయట పెట్టాలి.. గోపాల్ రెడ్డి అనే వ్యక్తికి పార్టీకి సంబంధం లేదని కర్ణాటక పోలీసులు స్పష్టం చేశారు అనే విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. కానీ సోమిరెడ్డి మాత్రం ఈ పార్టీని నాకు అంట కడుతున్నారు.. క్లబ్ కు వెళ్లడం, పేకాట ఆడటం, డ్రగ్స్ అలవాట్లు ఎవరికి ఉన్నాయో తేల్చుకుందాం అని సవాల్ చేశారు.

Read Also : TGSRTC : ఆ ఇద్దరు బీఆర్‌ఎస్‌ నేతలపై కేసు..

Exit mobile version