KA Paul – Jagan : ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘నాకు అపాయింట్‌మెంట్ ఇస్తే దీవిస్తా.. లేదంటే శపిస్తా’’ అని ఆయన సీఎం జగన్‌ను హెచ్చరించారు. సీఎం జగన్‌ను కలిసేందుకు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి వచ్చిన పాల్‌ను అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో మెయిన్ గేట్ వద్ద కేఏ పాల్ గంటసేపు ఎదురుచూశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో కలిసి పని చేద్దామని చెప్పేందుకు వచ్చానన్నారు. ‘‘సీఎం జగన్ అపాయింట్‌మెంట్ కోసం ఇవాళ అంతా వేచి చూస్తాను. అపాయింట్‌మెంట్ ఇస్తే దీవిస్తా.. లేదంటే శపిస్తా’’ అని కేఏ పాల్ అల్టిమేటం ఇచ్చారు. కేసీఆర్ సీఎంగా ఉండగా అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని గుర్తు చేసిన కేఏ పాల్.. అపాయింట్‌మెంట్ ఇవ్వనందుకు కేసీఆర్ మాజీ సీఎం అయ్యారని కామెంట్(KA Paul – Jagan) చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
‘‘మాజీ సీఎం అయ్యాకే కేసీఆర్ అపాయింట్‌మెంట్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక అపాయింట్‌మెంట్ ఇచ్చారు’’ అని ఆయన తెలిపారు. ఎంతోమంది దేశాధినేతలు, ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను కలిసిన చరిత్ర తనకు ఉందన్నారు. ఇవాళ, రేపు విజయవాడలోనే ఉండి వేచి చూస్తా.. అపాయింట్‌మెంట్ ఇస్తే సీఎంతో ముఖ్య విషయాలు చర్చిస్తా.. రహస్యాలు చెబుతా అని కేఏ పాల్ పేర్కొన్నారు. ఒకవేళ తనకు అపాయింట్‌మెంట్ ఇవ్వకపోతే జగన్ మాజీ సీఎం అవడం ఖాయమన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ 175 సీట్లు గెలుస్తారో.. 75 సీట్లు గెలుస్తారో.. 25 సీట్లే గెలుస్తారో తనకు తెలియదని కేఏ పాల్ వ్యాఖ్యానించారు. చివరకు సీఎం జగన్ అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడంతో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం వద్ద నుంచి ఆయన వెళ్లిపోయారు.
Also Read: WhatsApp Theme Color : వాట్సాప్‌కు ఇక మీకు నచ్చిన రంగు రుద్దొచ్చు!
శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతిపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫేస్‌బుక్ లైవ్‌లో ఆమె మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన నేపథ్యంలో ఆయన వివరణ కోరారు. దీంతో ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి పద్మావతికి పిలుపొచ్చింది. వెంటనే తాడేపల్లి రావాలని సీఎంవో అధికారులు సూచించారు. దీంతో ఆమె అమరావతికి చేరుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో కలిసి సీఎం జగన్‌ను కలవనున్నారు. మరోవైపు మాజీ మంత్రులు బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, వెలంపల్లి శ్రీనివాస్, ఎంపీ గోరంట్ల మాధవ్‌కు జగన్ అపాయింట్‌మెంట్ ఇచ్చారు. సాయంత్రంలోగా వారు సీఎంను కలవనున్నారు. తమ సీట్ల విషయంపై జగన్‌తో చర్చించనున్నారు.