KA Paul : జాలరి అవతారమెత్తిన కేఏ పాల్

మత్య్సకారుల సమస్యలు తనకు పూర్తిగా తెలుసున్న ఆయన.. మినీ హార్బర్ కట్టాలని ఎప్పటినుంచో వాళ్లు కోరుతున్నారని అన్నారు

Published By: HashtagU Telugu Desk
Pul Vizag

Pul Vizag

కేఏ పాల్ (KA Paul)..తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు ఏ ఎన్నికలు జరిగిన అక్కడ ప్రత్యేక్షం అవుతారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన దగ్గరి నుండి ఫలితాలు వచ్చేవరకు వార్తల్లో హైలైట్ అవుతుంటారు. గెలుపు సంగతి పక్కన పెడితే ఈయన చేసే హడావిడి..ప్రచారం..చెప్పే హామీలు..ఇచ్చే బిల్డప్ ఇదంతా కూడా ఆయనకు విపరీతమైన క్రేజ్ ను తీసుకొచ్చి పెడుతుంది. మునుగోడు ఉప ఎన్నికల్లో ఈయన చేసిన ప్రచారం కానీ , హడావిడి కానీ ఇప్పటికి యూట్యూబ్ లో , సోషల్ మీడియా లో వైరల్ అవుతూనే ఉంటాయి. మొన్నటికి మొన్న తెలంగాణ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పాల్ గట్టి హడావిడే చేసారు. ఇక ఇప్పుడు ఏపీ ఎన్నికల ప్రచారంలో కూడా అంతే. ప్రజాశాంతి పార్టీ తరుపున విశాఖపట్నం పార్లమెంట్ నుంచి కేఏ పాల్ బరిలోకి దిగుతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ సందర్బంగా కేఏ పాల్ జాలరి అవతారమెత్తారు. విశాఖపట్నం జిల్లా భీమిలిలో ఆయన మీడియాతో మాట్లాడారు. మత్య్సకారుల సమస్యలు తనకు పూర్తిగా తెలుసున్న ఆయన.. మినీ హార్బర్ కట్టాలని ఎప్పటినుంచో వాళ్లు కోరుతున్నారని అన్నారు. ఈసారి ఎన్నికల్లో తాను గెలిస్తే కచ్చితంగా మినీ హార్బర్ కట్టిస్తానని హామీ ఇచ్చారు. ఆర్థికంగా ఇబ్బందిపడుతున్న కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటానని హామీ ఇచ్చారు. విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న కుండ గుర్తుపై ఓటేసి తనను గెలిపించాలని మత్య్సకారులను కోరారు. కేఏ పాల్ దశ రత్నాలతో మేనిఫెస్టోను రూపొందించారు. దాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. తనకు కవరేజ్ ఇచ్చిన ఛానెళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇస్తానని మీడియాను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. ఒకవేళ హామీలకు నిధులు ఎక్కడ నుంచి వస్తాయని ఎవరైనా అడిగితే.. అమెరికా ప్రెసిడెంట్ మనోడే.. కోట్లలో నిధులు వస్తాయని సింపుల్‌గా ఒక్కముక్కలో చెప్పేసారు. హైదరాబాద్‌లో హైటెక్ సిటీ కట్టించేందుకు నిధులు తానే ఇచ్చానని కేఏ పాల్ చెప్పుకొచ్చారు. ఈయన మాటలు విన్న వారంతా నవ్వుకున్నారు.

Read Also : AP : జగన్ లో ఓటమి భయం మొదలైందనడానికి ఆయనే మాటలే నిదర్శనం

  Last Updated: 06 May 2024, 11:12 PM IST