Site icon HashtagU Telugu

KA Paul : చంద్రబాబు అరెస్ట్ ని సమర్ధించిన కేఏ పాల్..

KA Paul Supports Chandrababu Arrest in AP

KA Paul Supports Chandrababu Arrest in AP

ఏపీ(AP)లో ఎక్కడ చూసినా చంద్రబాబు అరెస్ట్(Chandrababu Arrest) గురించే మాట్లాడుకుంటున్నారు. రాజకీయ నాయకుల్లో కూడా అధికార, ప్రతిపక్ష నాయకులు అంతా చంద్రబాబు అరెస్ట్ గురించి ప్రెస్ మీట్స్ పెట్టి మరీ మాట్లాడుతున్నారు. తెలుగు రాజకీయాల్లో ఏం జరిగినా స్పందించే కేఏ పాల్(KA Paul) తాజాగా ఈ విషయంపై కూడా స్పందించాడు.

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ నేడు మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు వందకు వందశాతం అవినీతి చేశాడు. అందుకే అరెస్ట్ చేశారు. చంద్రబాబును గాంధీ,ఆంబేద్కర్ తో పోల్చడం దారుణం. టీడీపీ కార్యకర్తలు ఎవరూ రోడ్లమీదకి రాలేదు. చంద్రబాబు గురించి నాకు బాగా తెలుసు. ఎందుకంటే చంద్రబాబు నా శిష్యుడు. జగన్మోహన్ రెడ్డి రేపు డిల్లి వెళ్ళి ప్రధాని,అమిత్ షాను కలవనున్నారు. చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి కేంద్రానికి తొత్తులు. చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డిపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారు అని అన్నారు.

ఇక జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ.. జూనీయర్ ఎన్టీఆర్ తెలివైనవాడు అందుకే ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నారు అని అన్నారు కేఏ పాల్. దీంతో కేఏ పాల్ చంద్రబాబు అరెస్ట్ ని సమర్ధించడంతో పాటు జగన్ ని కూడా విమర్శించడంతో ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

 

Also Read : Nara Bhuvaneshwari : రాజమండ్రిలో భువనేశ్వరి కన్నీరు.. చంద్రబాబుని కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ..