KA Paul : వైజాగ్ స్టీల్ ప్లాంట్, జన సైనికులపై KA పాల్ సంచలన కామెంట్స్..

తాజాగా KA పాల్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం 4 వేల కోట్లు రెడీ చేసి వచ్చాను. కేంద్రం అనుమతి ఇస్తే సమస్య తొలగినట్టే. త్వరలో కేంద్రం నుంచి అనుమతి వస్తుంది.

Published By: HashtagU Telugu Desk
KA Paul Sensational comments on Vizag Steel Plant and Janasena Members

KA Paul Sensational comments on Vizag Steel Plant and Janasena Members

KA పాల్ రెగ్యులర్ గా రాజకీయాలపై, పలువురు రాజకీయ నాయకులపై సంచలన కామెంట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. తన ప్రజాశాంతి పార్టీ నుంచి అన్ని చోట్ల పోటీ చేస్తానని, ఎలక్షన్స్(Elections) లో గెలుస్తానని హడావిడి చేస్తూ ఉంటాడని తెలిసిందే. ఇక అప్పుడప్పు KA పాల్ ప్రెస్ మీట్స్ పెట్టి ఇష్టమొచ్చింది, అందరు రాజకీయ నాయకుల గురించి మాట్లాడాతాడు.

తాజాగా KA పాల్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం 4 వేల కోట్లు రెడీ చేసి వచ్చాను. కేంద్రం అనుమతి ఇస్తే సమస్య తొలగినట్టే. త్వరలో కేంద్రం నుంచి అనుమతి వస్తుంది. కుటుంబ, కుల రాజకీయాలకు వ్యతిరేకంగా పని చేద్దాం రండి. కాపు, బీసీ, ఎస్సీలు అందరూ కలిసి రండి. చంద్రబాబు విశాఖ రావడం అనవసరం. చంద్రబాబు దుబాయ్, సింగపూర్ లో రిటైర్ అయితే మంచిది. 100 కంపెనీలు పెడతా, లక్ష ఉద్యోగాలు ఇస్తాను అని అన్నారు.

ఇక జన సైనికుల గురించి మాట్లాడుతూ.. పవన్ పార్టీ అభ్యర్థులకు బుద్ది వచ్చిందా? జనసేన నుంచి ప్రజాశాంతి పార్టీలో చేరితే ఒక్కో అభ్యర్థికి వాళ్ళ నియోజకవర్గం అభివృద్ధి కోసం 100 కోట్లు ఇస్తా. జనసైనికులు లోకేష్ జెండా మోయకండి, వంగవీటి రంగా ఆత్మ ఘోషిస్తుంది. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తుల వలనే బీసీలు ముఖ్యమంత్రి కాలేదు. జేడి లక్ష్మి నారాయణను ప్రజాశాంతి పార్టీలో చేరాలని ఆహ్వానించాను. గద్దర్ లాంటి ప్రజా నాయకులే ప్రజాశాంతి పార్టీలో చేరుతున్నారు. ఏపి, తెలంగాణ ఎన్నికల్లో నేను పోటీ చేస్తున్నా. పార్టీ నుంచి అన్ని స్థానాల్లో అభ్యర్థులను నిలబెడతా అని అన్నారు. దీంతో KA పాల్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

 

Also Read ;  GO 111: జీవో 111 రద్దుపై రాజకీయ నాయకుల విమర్శలు

  Last Updated: 19 May 2023, 07:51 PM IST