KA Paul : నా చేతులు కాళ్ళు విరగ్గొట్టారు.. చంపడానికి ప్రయత్నం చేశారు.. వైజాగ్‌లో కేఏ పాల్ దీక్ష భగ్నం..

కేఏ పాల్ ని పరామర్శించడానికి విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి నేతలు వెళ్లారు. ఈ నేపథ్యంలో కేఏపాల్ మాట్లాడుతూ గవర్నమెంట్ పై, పోలీసులపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

  • Written By:
  • Publish Date - August 29, 2023 / 07:07 PM IST

వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌(Vizag Steel Plant) ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్‌(KA Paul) ఇవాళ ఉదయం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే పోలీసులు కేఏ పాల్ దీక్షని భగ్నం చేశారు. కొంతమందిపై లాఠీ ఛార్జ్ చేశారు. కేఏ పాల్ ను వైజాగ్ ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు.

దీంతో కేఏ పాల్ ని పరామర్శించడానికి విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి నేతలు వెళ్లారు. ఈ నేపథ్యంలో కేఏపాల్ మాట్లాడుతూ గవర్నమెంట్ పై, పోలీసులపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

కేఏ పాల్ మాట్లాడుతూ.. పోలీసులు నా చేతులు,కాళ్ళు విరగగొట్టారు. నా దీక్ష 24 గంటలు గడవకముందే భగ్నం చేశారు. ఏపీలో రాక్షస పాలన సాగుతుంది. తక్షణమే సిఐ రామారావును సస్పెండ్ చేయాలి. నా చావు కోసం ఈ రాజకీయ పార్టీలు ఎదురు చూస్తున్నాయి. విశాఖ స్టీల్ ఫ్లాంట్ నష్టాల్లో లేదు. నష్టాలు వచ్చేటట్లు చేస్తున్నారు. విశాఖ ఎంపీ MVV నాలుగున్నర సంవత్సరాలుగా విశాఖకు ఏమి చేశాడు? టిడిపి, వైసిపి, బీజేపీ పార్టీలకు చిత్తశుధ్ధి ఉంటే స్టీల్ ఫ్లాంట్ కోసం రాజీనామాలు చేయండి. నాతో ప్రధాని మోదీ మాట్లాడేవరకు నేను దీక్ష విరమించను. కేజీహెచ్ లో మత్తు మందు ఇచ్చి నన్ను చంపడానికి ప్రయత్నం చేశారు. భోజనం చేయకుండా నా దీక్షను ఇక్కడే కొనసాగిస్తాను. ఎట్టి పరిస్థితుల్లోనూ విశాఖ స్టీల్ ఫ్లాంట్ ను అమ్మనివ్వను అని అన్నారు.

 

Also Read : AP Employees : జ‌గ‌న్ జీపీఎస్ !ఉద్యోగుల చీలిక‌తో గ‌ప్ చిప్!