KA Paul Vs Pawan Kalyan : జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కంటే తానే బెటర్ అని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. ఈవిషయాన్ని స్వయంగా వైఎస్సార్ సీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ తనతో చెప్పారని పేర్కొన్నారు. తాను విశాఖపట్నం స్థానం నుంచి ఎంపీగా పోటీ చేస్తానని ప్రకటించారు. తనకు ప్రజలందరి మద్దతు ఉందన్నారు. గ్లోబల్ క్రిస్మస్ కార్యక్రమం నవంబర్ 9న విశాఖలో జరుగుతుందని, ఇక్కడి నుంచి 200 దేశాలకు సందేశం ఇవ్వబోతున్నానని చెప్పారు. ఆ కార్యక్రమానికి వచ్చిన అందరూ లంచ్ చేసి వెళ్ళాలని కోరారు. ప్రజాశాంతి పార్టీలోకి ఆయన సమక్షంలో కొంతమంది బీసీ నేతలు చేరారు. కేఏ పాల్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈ సందర్భంగా శనివారం ఆయన విశాఖలో మీడియతో మాట్లాడుతూ విశాఖపట్నం ఎంపీగా తాను పోటీ చేస్తున్నానని వెల్లడించారు. ‘‘తెలంగాణ ప్రజలు కేసీఆర్ పాలన కంటే కేఏ పాల్ పాలన వస్తేనే బెటర్ అని చెబుతున్నారు. తెలంగాణ ప్రజలు కూడా నన్ను కోరుకుంటున్నారు అనేది క్లియర్.. ప్రజల్లో శాంతి చేకూరాలంటే ప్రజాశాంతి పార్టీ రావాలి’’ అని కేఏ పాల్ (KA Paul Vs Pawan Kalyan) వ్యాఖ్యానించారు.