KA Paul : KA పాల్ దగ్గర పవన్ సీఎం అయ్యే ప్లాన్..!!

ప్రజాశాంతి పార్టీ స్థాపకుడు KA పాల్..నిత్యం ఏదొక వార్త తో వార్తల్లో నిలుస్తుంటారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు వస్తున్నాయంటే చాలు పాల్ హడావిడి మాములుగా ఉండదు..గెలుపు మాదే అనే రేంజ్ లో బిల్డప్ ఇస్తుంటారు. ఆ మధ్య మునుగోడు ఉప ఎన్నికల్లో పాల్ చేసిన హడావిడి ఇప్పటికి సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంటుంది. We’re now on WhatsApp. Click to Join. ఇక ఇప్పుడు ఏపీ రాజకీయాలపై దృష్టి పెట్టారు. రీసెంట్ గా […]

Published By: HashtagU Telugu Desk
Ka Pawan

Ka Pawan

ప్రజాశాంతి పార్టీ స్థాపకుడు KA పాల్..నిత్యం ఏదొక వార్త తో వార్తల్లో నిలుస్తుంటారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు వస్తున్నాయంటే చాలు పాల్ హడావిడి మాములుగా ఉండదు..గెలుపు మాదే అనే రేంజ్ లో బిల్డప్ ఇస్తుంటారు. ఆ మధ్య మునుగోడు ఉప ఎన్నికల్లో పాల్ చేసిన హడావిడి ఇప్పటికి సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంటుంది.

We’re now on WhatsApp. Click to Join.

ఇక ఇప్పుడు ఏపీ రాజకీయాలపై దృష్టి పెట్టారు. రీసెంట్ గా తనపై హత్యాయత్నం జరిగిందని చెప్పి సంచలనం రేపారు. క్రిస్మస్ వేడుకల్లో ఫుడ్ పాయిజన్ జరిగిందని..ఎవరో తనను చంపేందుకు ట్రై చేసారని తెలిపి వార్తల్లో నిలిచారు. ఇక ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీఎం అయ్యే ప్లాన్ తన దగ్గర ఉందని..ఆ ప్లాన్ ఆయనకు చెప్పేందుకు వెళ్తే కలవలేదని తెలిపి షాక్ ఇచ్చాడు. ముందుగా ఈయన తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లి అక్కడ జగన్ ను కలవడానికి ట్రై చేయగా.. అక్కడ పోలీసులు ఆయన్ను నిలిపివేశారు. చేసేదిలేక కేఏ పాల్ అక్కడి నుంచి వెనుదిరిగారు. ఆ తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలవడం కోసం జనసేన కార్యాలయానికి వెళ్లారు. అక్కడ ఆయన దాదాపు అరగంట నుంచి గేట్ బయట ఉండి వేచి చూశారు.

పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి చేయడానికి తన దగ్గర మాస్టర్ ప్లాన్ ఉందని కేఏ పాల్ అక్కడ వేచి ఉన్నారు. ఈ విషయం జనసేన కార్యాలయ సిబ్బందికి కేఏ పాల్ చెప్పినప్పటికి వారు లోనికి అనుమతించలేదు. తన మాస్టర్ ప్లాన్ వింటే పవన్ కళ్యాణ్ సీఎం అవుతారు అంటూ జనసేన కార్యాలయం సిబ్బందితో పాల్ తెలిపారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రోజూ తనని ఒత్తిడి చేస్తున్నారని.. ఎలాగైనా తమ హీరో పవన్ కళ్యాణ్ ను సీఎం చేయాలని బతిమాలుతున్నారని పాల్ చెప్పుకొచ్చారు. అందుకే పవన్ కల్యాణ్ ను కలవడం కోసం వచ్చానని పాల్ తెలిపారు. కానీ పవన్ ను కలవకుండా వెనక్కు వచ్చారు.

Read Also : Big Breaking : జనసేన లోకి అంబటి రాయుడు..?

  Last Updated: 10 Jan 2024, 01:51 PM IST