Site icon HashtagU Telugu

KA Paul Offer to Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కు భారీ ఆఫర్ ఇచ్చిన KA పాల్..

Paul Offer To Pawan

Paul Offer To Pawan

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కు ప్రజాశాంతి పార్టీ (Prajasanthi Party) అధినేత KA పాల్ (KA Paul) బంపర్ ఆఫర్ ప్రకటించారు. పవన్ కళ్యాణ్..ప్రజాశాంతి పార్టీలో చేరితే ఆయనకు సీఎం పదవి ఇస్తానని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో జనసేనకు టీడీపీ 24 సీట్లే మాత్రమే ఇస్తుంది.. కానీ ప్రజాశాంతి పార్టీ మాత్రం 48 సీట్లు ఇస్తాం.. అలాగే సీపీఐ, సీపీఎంలకు 12 స్థానాలు ఇస్తామని పాల్ తెలిపారు. రాష్ట్ర ప్రజలందరూ నావైపే ఉన్నారని , నేనే ప్రచారం చేసి అభ్యర్థులందరినీ గెలిపించుకుంటా.. పవన్ కళ్యాణ్ మా ప్రజాశాంతి పార్టీలోకి వస్తే తప్పకుండా CMను చేస్తానని హామీ ఇచ్చారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇదిలా ఉంటె సోమవారం పాల్..తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా ఇద్దరు కాసేపు మాట్లాడుకున్నారు. జనవరి 30న జరిగే ప్రపంచ శాంతి సదస్సుకు సీఎం రేవంత్‌ రెడ్డిని తాను ఆహ్వానించానని, అందుకు ఆయన సానుకూలంగా స్పందించినట్లు కేఏ పాల్ తెలిపారు. అలాగే గ్లోబల్ పీస్ సదస్సుకు కావాల్సిన అనుమతులను మంజూరు చేయాల్సిందిగా సీఎంను కోరినట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపారు. అలాగే ఈ ప్ర‌పంచ శాంతి స‌ద‌స్సుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు ప‌లువురు నాయ‌కుల‌ను ఆహ్వానించిన‌ట్లు కేఏ పాల్ పేర్కొన్నారు. ప‌లు దేశాల నుంచి వేల మంది ఈ సదస్సుకు హాజ‌ర‌వుతున్న‌ట్లు పాల్ వెల్ల‌డించారు.

Read Also : YS Sharmila : కడప ఎంపీ బరిలో వైఎస్ షర్మిల ?