KA Paul Party: కేఏ పాల్ కు ‘ఈసీ’ షాక్.. పార్టీ రిజిస్ట్రేషన్ రద్దు!

భారత ఎన్నికల సంఘం (ECI) ఉనికిలో లేని రిజిస్టర్డ్ అన్ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీలను (RUPPs) తొలగించింది.

  • Written By:
  • Updated On - September 14, 2022 / 12:07 PM IST

భారత ఎన్నికల సంఘం (ECI) ఉనికిలో లేని రిజిస్టర్డ్ అన్ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీలను (RUPPs) తొలగించింది. ఈ జాబితాలో తెలంగాణ రాష్ట్రానికి చెందినవారు కూడా 20 మంది ఉన్నారు.  వాటిలో ఆలిండియా మహిళా డెమోక్రటిక్ ఫ్రంట్, నవ తెలంగాణ పార్టీ, మన పార్టీ, తల్లి తెలంగాణ పార్టీ, ప్రజా పార్టీ, ప్రజా భారత్ పార్టీ, యూత్ డెమోక్రటిక్ ఫ్రంట్, నేషనలిస్ట్ తెలంగాణ రాష్ట్ర సమితి, క్రైస్తవ మత ప్రచారకుడు KA పాల్ స్థాపించిన ప్రజా శాంతి పార్టీ (PSP) కూడా ఉంది.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెట్టాలనుకుంటున్న పాల్‌కు ఈసీ నిర్ణయం షాక్‌గా మారింది. పీఎస్పీలో చేరాల్సిందిగా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ను కూడా ఆయన ఆహ్వానించారు. తెలుగు రాష్ట్రాల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తుందని పాల్ అన్నారు. ఇటీవల సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం జక్కాపురం గ్రామం వద్ద రైతులను కలిసేందుకు వెళుతుండగా, టీఆర్‌ఎస్ కార్యకర్త ఒకరు కొట్టారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు (కెసిఆర్), ఆయన కుమారుడు కె. తారక రామారావు (కెటిఆర్)పై ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.