KA Paul : KA పాల్ వద్ద 2 లక్షలు కూడా లేవట..అఫిడవిట్లో వెల్లడి

విశాఖపట్నం పార్లమెంట్ నుంచి కేఏ పాల్ బరిలోకి దిగుతున్నారు

  • Written By:
  • Publish Date - April 19, 2024 / 11:10 AM IST

తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల పర్వం మొదలుకావడం తో అన్ని పార్టీల నేతలు తమ నామినేషన్ లను దాఖలు చేస్తున్నారు. పార్టీ నేతలు , అభిమానులు , కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీతో వెళ్లి తమ నామినేషన్ కు సంబంధించి దాఖలు చేస్తూ వస్తున్నారు. తెలంగాణ లో నిన్న ఒక్క రోజే దాదాపు 48 మందికి పైగా అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయగా..ఏపీలో మొదటి రోజు 39 మంది MP అభ్యర్థులు, 190 ఎమ్మెల్యే అభ్యర్థులు నామినేషన్లు వేశారు. వైసీపీ అభ్యర్థుల కంటే ముందే కూటమి అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయడం విశేషం.

We’re now on WhatsApp. Click to Join.

ఇక ఈరోజు కూడా నామినేషన్ వేసేందుకు అన్ని పార్టీల నేతలు సిద్ధం అయ్యారు. ఇక ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు KA పాల్ (KA Paul) సైతం తన నామినేషన్ ను దాఖలు చేసారు. విశాఖపట్నం పార్లమెంట్ నుంచి కేఏ పాల్ బరిలోకి దిగుతున్నారు. ఈ సందర్బంగా తన ఆస్తుల వివరాలను ఎన్నికల అఫిడవిట్లో వెల్లడించారు. ‘నా పేరిట రూ.1.86 లక్షలు మాత్రమే ఉంది. వాహనాలు, రుణాలు, స్థిరాస్తులు లేవు’ అని అఫిడవిట్లో పేర్కొన్నారు. అలాగే తనపై ఒంగోలు, మహబూబ్ నగర్, ఎల్.కోట, రాజన్న సిరిసిల్ల, నల్గొండ ప్రాంతాల్లో ఆరు కేసులు ఉన్నట్లు వెల్లడించారు.

ఇక ఈసారి ప్రజాశాంతి పార్టీ (Praja Shanti Party) కి కేంద్ర ఎన్నికల సంఘం కుండ గుర్తు కేటాయించింది. గాజువాక ఎమ్మెల్యేగా, విశాఖ ఎంపీగా కేఏ పాల్ పోటీ చేస్తున్నారు.

Read Also : TDP : ఎల్లుండి అభ్యర్థులకు టీడీపీ బీఫాంలు