Site icon HashtagU Telugu

KA Paul : బాబు బ‌హిరంగ స‌భలు ఆపాలి.. కేఏ పాల్ డిమాండ్‌

Ka Paul

Ka Paul

చంద్రబాబు నాయుడు బహిరంగ సభలు ఆపాలని ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ డిమాండ్ చేశారు. తోపులాట ఘటనల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు బహిరంగ సభలు నిర్వహించడం మానుకోవాలని అన్నారు. గుంటూరులో జరిగిన తాజా ఘటనలో బాధితులను సోమవారం ప్రభుత్వాసుపత్రిలో పరామర్శించిన పాల్ వారి కోలుకోవాల‌ని ప్రార్థించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌ను నాశనం చేసి పేదల జీవితాలతో ఆడుకుంటున్నారని విమ‌ర్శించారు. గుంటూరులో ఆదివారం జరిగిన టీడీపీ అధినేత బహిరంగ సభ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. గత నాలుగు రోజుల్లో ఇలాంటి ఘటన ఇది రెండోది. నెల్లూరులో మొన్న జరిగిన ఘటనలో ఎనిమిది మంది చనిపోయారు.

చంద్రబాబు అనధికార సమావేశాలు నిర్వహిస్తున్నారని.. . ఆయన 14 ఏళ్లు ఆంధ్రా సీఎం? రాష్ట్రానికి ఏం చేశారని ప్ర‌శ్నించారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టార‌ని ఆరోపించారు. ప్రస్తుత సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కూడా అదే బాటలో నడుస్తున్నారని కేఏ పాల్ తెలిపారు. బహిరంగ సభలు నిర్వహించకుండా చంద్ర‌బాబుని అడ్డుకునేందుకు హైకోర్టును ఆశ్రయిస్తానని ప్రకటించారు. బాధిత కుటుంబాలకు తమ పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

Exit mobile version