Site icon HashtagU Telugu

KA Paul: నువ్ మామూలోడివి కాదయ్యా పాల్ : పవన్ సీఎం అవ్వడం ఖాయం..కానీ జగన్ ఆ పార్టీలోకి రావాలి..చంద్రబాబు.?

Ka Paul

Ka Paul

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. ఆయన ఏం మాట్లాడినా…సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూంటుంది. తెలిసి కొన్ని…తెలియక కొన్ని పంచ్ లు విసురుతూ…వైరల్ అవుతుంటాడు. ఆయన కాస్త డిఫరెంట్…ఉన్నది ఉన్నట్లు మాట్లాడటం ఆయన స్పెషల్. మొత్తానికి సామాజిక మాధ్యమాల్లో పాల్ అంటే ఎనలేని క్రేజ్. మామూలు మీడియా ఆయనంటే ఇంట్రెస్ట్ చూపించకపోవచు కానీ…ఆయన మాటలు మాత్రం తెగ వైరల్ అవుతుంటాయి.

కాగా ఆంధ్రప్రదేశ్ లో పర్యటిస్తానని బయలుదేరిన పాల్…తాజాగా ఏలూరులో పర్యటించారు. అక్కడ ఓ టీ కొట్టులో ఆయన చాయ్ తాగుతూ వచ్చిపోయే వారిని పలికరించారు. పార్టీలో చేరండంటూ ఆఫర్ ఇచ్చారు. జనసేనాని…టీడీపీ అధినేత, ఏపీ సీఎం పై పాల్ వేసిన పంచ్ లకు అక్కుడన్న వారంతా నవ్వు ఆపులేకపోయారు. ఇంతకీ పాల్ వేసిన పంచ్ లు ఏంటంటరా….పవన్ ముఖ్యమంత్రి కావడం ఖాయం…కానీ పవన్ మా వైపు రావాలి. పవన్ తమ్ముడికి నేను అన్నివేళలా అండగా ఉంటా….ఆయన్ని ముఖ్యమంత్రి చేసే బాధ్యత నాది. కానీ పవన్ బీజేపీకి మిత్రుడిగా ఉన్నారు. బీజేపీలో ఉంటే పవన్ ఎప్పుడూ సీఎం కాలేరు. ఇక చంద్రబాబు వయస్సు అయిపోయింది. రాజకీయం కూడా అయిపోయింది. చంద్రబాబు కుటుంబ పాలనను అంతమొందించేలా కలిసి పోరాడాలి అంటూ భారీ డైలాగులు పేల్చేశాడు పాల్.

జగన్ను కూడా విడిచిపెట్టలేదు. జగన్ మా పార్టీలో చేరాలంటూ కొత్త రాగం అందుకున్నాడు. ప్రజాశాంతి పార్టీలో చేరితే బాగుంటుందన్నారు. పేదలకు న్యాయం చేయవచ్చు అంటూ పలు కీలకమైన సూచనలు చేశారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పంచులకు ఎలాంటి లోటులేదంటూ చెప్పేస్తున్నారు. పాల్ పంచ్ విని నెటిజన్స్ …నువ్ మామూలోడివి కాదయ్యా అంటూ తెగ నవ్వేస్తున్నారు.