Site icon HashtagU Telugu

AP : చంద్రబాబును అప్పుడు కాపాడింది ఆ వెంకన్నే ..ఇప్పుడు కాపాడేది ఆ వెంకన్నే – దర్శకేంద్రుడు

K raghavendra rao comments chandrababu arrest

K raghavendra rao comments chandrababu arrest

స్కిల్ డెవలప్ మెంట్ కేసు (Skill development case)లో అరెస్టై..జైలు లో ఉన్న చంద్రబాబు (Chandrababu) ను బయటకు తీసుకొచ్చేందుకు లాయర్లు శతవిధాలా ట్రై చేస్తున్నారు..రెండు రోజులుగా ఎన్ని వాదనలు వినిపించిన..జైల్లో ప్రాణ హాని ఉందంటూ చెపుతున్న ACB కోర్ట్ మాత్రం చంద్రబాబు ఫై కనికరించడం లేదు. జైల్లో భద్రత ను పెంచుతాం తప్ప హౌస్ రిమాండ్ కు పంపించేది లేదంటూ చెపుతుంది. దీంతో టీడీపీ శ్రేణుల్లో ఆందోళన రోజు రోజుకు ఎక్కువైపోతోంది. చంద్రబాబు బయటకు వస్తారో రారో..? బెయిల్ ఇస్తారో ఇవ్వరో..? జైల్లో ఎలాంటి హాని జరుగుతుందో అని..? ఇలా ఎవరికీ వారే ప్రశ్నలు వేసుకుంటూ మనోవేదనకు గురి అవుతున్నారు. కొంతమంది గుండెను రాయి చేసుకొని..ఆపుకుంటుంటే..మరికొంతమంది మాత్రం ప్రాణాలు వీడుస్తున్నారు. ఇప్పటికే దాదాపు 25 కు పైగా చంద్రబాబు అభిమానులు , టీడీపీ శ్రేణులు మరణించారు.

మరోపక్క చంద్రబాబు అరెస్ట్ ఫై రోజు రోజుకు ఆగ్రహపు జ్వాలలు ఎక్కువైపోతున్నాయి. ఓ పక్క టీడీపీ (TDP) శ్రేణులు నిరసనలు కొనసాగిస్తుండగా..మరోపక్క దేశంలోని అన్ని పార్టీల నేతలు చంద్రబాబు అరెస్ట్ ను వ్యతిరేకిస్తూ..జగన్ ఫై నిప్పులు చెరుగుతున్నారు. అయితే టాలీవుడ్ పెద్దలు మాత్రం ఇంతవరకు స్పందించకపోవడం ఫై టీడీపీ శ్రేణులు కాస్త ఆగ్రహం గా ఉన్నారు. రాజమౌళి , మురళి మోహన్ , బోయపాటి అశ్విని దత్ ఇలా మరికొంతమంది చంద్రబాబు కు దగ్గరగా ఉన్న వారు సైతం అరెస్ట్ ను ఖండించకపోవడం ఫై అంత విమర్శిస్తున్నారు. ఇప్పటివరకు చిత్రసీమ నుండి ఒక్క దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు (K Raghavendra rao) మాత్రమే స్పందించారు. ఇప్పటికే చంద్రబాబు అరెస్ట్ ను ఖండించగా..తాజాగా మరోసారి స్పందించారు.

Read Also : AP : ‘తండ్రి’ శవం వద్ద సంతకాల కోసం ట్రై చేసిన ‘స్కిల్’ జగన్ మోహన్ రెడ్డిది – రేణుకా చౌదరి

గతంలో చంద్రబాబు శ్రీ వెంకటేశ్వరస్వామి కృపా కటాక్షాలతో అలిపిరి బాంబ్ బ్లాస్ట్ నుంచి క్షేమంగా బయటపడ్డారని.. ఇప్పుడు కూడా ఆ స్వామి వారే చంద్రబాబును కాపాడతారని రాఘవేంద్రరావు స్పష్టం చేశారు. వెంకటేశ్వరస్వామి వారి ఆశీస్సులతో చంద్రబాబు ఎలాంటి అవినీతి మచ్చ లేకుండా జైలు నుంచి తప్పకుండా బయటపడతారని పేర్కొన్నారు.