Site icon HashtagU Telugu

YS Sharmila : అవినాష్‌ బెయిల్‌పై ఉన్నందునే సునీతకు న్యాయం జరగడం లేదు: వైఎస్‌ షర్మిల

YS Sharmila

YS Sharmila

YS Sharmila : ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల గురువారం విలేకరులతో మాట్లాడుతూ..మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఎంపీ అవినాష్‌రెడ్డి బెయిల్‌పై ఉంటూ సాక్షులను బెదిరిస్తున్నారని ఆరోపించారు. వివేకా హత్య కేసులోని సాక్షులు ఒక్కొక్కరిగా ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పారు. అవినాష్‌ బెయిల్‌పై ఉన్నందునే సునీతకు న్యాయం జరగడం లేదు. సాక్షులను బెదిరించి ఒత్తిడి తెస్తున్నా బెయిల్‌ రద్దు చేయట్లేదు. వివేకాను సునీత, ఆమె భర్త చంపించారని తప్పుడు రిపోర్టు ఇచ్చారు. హత్య జరిగిన సమయంలో ఘటనాస్థలిలో ఉన్నది అవినాష్‌ రెడ్డే అని వైఎస్‌ షర్మిల అన్నారు.

Read Also: TG High Court : కంచ గచ్చిబౌలి భూముల అంశం.. హైకోర్టు విచారణ వాయిదా

ఈ కేసులో నిందితులుగా ఉన్నవారు సునీతను ఏమైనా చేస్తారనే భయం ఉంది. వివేకా కుమార్తె సునీతకు ఇద్దరు పిల్లలున్నారు. ఆమె ప్రాణాలకు రక్షణ లేదు. ఇటీవల నాకు తెలిసిన విషయాలు నన్ను ఆలోచింపజేస్తున్నాయి. అవినాష్‌ బెయిల్‌ రద్దు పిటిషన్‌పై ప్రభుత్వ అఫిడవిట్‌లో పలు అంశాలు ఉన్నాయి. విచారణ అధికారులను ఆయన పిలిపించుకొని బెదిరించారని అఫిడవిట్‌లో ఉంది. తప్పుడు రిపోర్టుపై అధికారులతో అవినాష్‌ సంతకాలు చేయించినట్లుగా ఉందని వైఎస్‌ షర్మిల అన్నారు.

Read Also: Anchor Pradeep: రాజకీయ నాయకురాలితో మ్యారేజ్.. యాంకర్ ప్రదీప్ రియాక్షన్