Site icon HashtagU Telugu

Junior NTR : TDPలో జూనియ‌ర్ క్రేజ్ డౌన్

Junior Ntr.

Junior Ntr.

స్వ‌ర్గీయ ఎన్టీఆర్ శ‌త‌జ‌యంతి వేడుక హైద‌రాబాద్ లో ముగిసిన‌ప్ప‌టికీ దాని మీద స్క్రూటినీ మాత్రం ఆగ‌లేదు. ఆ రోజు అగ్ర హీరోలుగా ఉన్న జూనియ‌ర్(Junior NTR), ప్ర‌భాస్ ,  ప‌వ‌న్ ( pawan) ఎందుకు హాజ‌రు కాలేదు? అనేదానిపై సీరియ‌స్ గా చ‌ర్చ జరుగుతోంది. ప్ర‌త్యేకించి జూనియ‌ర్ ఎన్టీఆర్ గైర్హాజ‌రు సోష‌ల్ మీడియా వేదిక‌గా ప‌లు ర‌కాల చ‌ర్చ‌ల‌కు దారితీస్తోంది. ఇక నుంచి టీడీపీతో ఎలాంటి సంబంధం జూనియ‌ర్ కు లేద‌ని కొంద‌రు ట్రోల్స్ చేస్తున్నారు. నంద‌మూరి (Nandamuri)కుటుంబానికి చెందిన స‌భ్యుడు జూనియ‌ర్ కాద‌ని మ‌రికొంద‌రు విప‌రీతార్థాలు వ‌చ్చేలా కామెంట్లు పెడుతున్నారు. జూనియ‌ర్ ఫ్యాన్స్ వ‌ర్సెస్ నారా అభిమానుల మ‌ధ్య ఒక యుద్ధ‌మే సోష‌ల్ మీడియా వేదిక‌గా జ‌రుగుతోంది.

ఎన్టీఆర్ శ‌త‌జ‌యంతి వేడుక  స్క్రూటినీ (Junior NTR)

సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖుల‌ను శత‌జ‌యంతి వేడుక సంద‌ర్భంగా నిర్వాహ‌కులు ఆహ్వానించారు. ప్ర‌త్యేకించి నారా కుటుంబానికి న‌మ్మ‌క‌స్తుడిగా ఉండే టీడీపీ కార్యాల‌య కార్య‌ద‌ర్శి టీడీ జనార్థ‌న్ (TD Janardan)ఈ వేడుక నిర్వ‌హ‌ణ బాధ్య‌త‌ను తీసుకున్నారు. విజ‌య‌వాడ‌లో జ‌రిగిన శ‌త‌జ‌యంతి వేడుక‌ను కూడా ఆయ‌న స్వ‌యంగా ద‌గ్గ‌రుండి జ‌రిపించారు. హైద‌రాబాద్ లో జ‌రిగే శ‌త‌జ‌యంతి వేడుక‌కు రావాల‌ని జూనియ‌ర్ కు ఆయ‌నే ఆహ్వాన ప‌త్రిక‌ను అందించారు. అందుకు సంబంధించిన ఫోటోను కూడా మీడియాకు విడుద‌ల చేయ‌డం జ‌రిగింది. అలాగే, ప్ర‌భాస్, ప‌వ‌న్, అల్లు అర్జున్, రామ్ చ‌ర‌ణ్ , అక్కినేని నాగార్జున, సుమ‌న్ త‌దిత‌రుల‌ను ఆహ్వానించారు. కానీ, మంచు మోహ‌న్ బాబు (Manchu Mohanbabu) కుటుంబాన్ని ఆహ్వానించ‌లేద‌ని టాలీవుడ్ లోని టాక్‌.

మంచు మోహ‌న్ బాబు  కుటుంబాన్ని ఆహ్వానించ‌లేద‌ని

హైద‌రాబాద్ లో జ‌రిగిన శ‌త‌జ‌యంతి వేడుక‌కు మెగా కుటుంబం నుంచి రామ్ చ‌ర‌ణ్ (Ramcharan) హాజ‌ర‌య్యారు. అంతేకాదు, అల్లు కుటుంబం నుంచి అర‌వింద్‌, అక్కినేని ఫ్యామిలీ త‌ర‌పున నాగ‌చైత‌న్య(nagachitanya) క‌నిపించారు. రాజ‌కీయ మిత్రునిగా భావిస్తోన్న ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆ వేడుక‌కు రాలేదు. మెగా స్టార్ చిరంజీవి వ‌స్తార‌ని భావించిన‌ప్ప‌టికీ కుమారుడు రామ్ చ‌ర‌ణ్ హాజ‌రు కావ‌డంపై టీడీపీ సంతోషంగా ఉంది. ఇక టాలీవుడ్ అగ్ర‌హీరోల జాబితాలో ఉన్న ప్ర‌భాస్, (Prabhas), జూనియ‌ర్ (Junior NTR)డుమ్మా కొట్టారు. ఇదే పెద్ద హాట్ టాపిక్ గా గ‌త రెండు రోజులుగా న‌డుస్తోంది. ఈనెల 20వ తేదీ జ‌రిగిన ఆ వేడుక సెగ‌లు ఇంకా సినీ, రాజ‌కీయ వ‌ర్గాల‌ను పూర్తిగా వీడ‌లేదు. అగ్ర‌హీరోల డుమ్మా కొట్ట‌డం ప‌లు ర‌కాలుగా చ‌ర్చించుకుంటున్నారు.

జూనియ‌ర్ ఫ్యాన్స్ వ‌ర్సెస్ నారా అభిమానుల మ‌ధ్య ఒక యుద్ధ‌మే

తెలుగుదేశం పార్టీ నిర్వ‌హించే కార్య‌క్ర‌మాలకు ఎప్పుడూ జూనియ‌ర్ ను గ‌త కొన్నేళ్లుగా ఆహ్వానించ‌డంలేదు. మ‌హానాడుకు సైతం స‌మాచారం పంప‌డంలేద‌ని జూనియ‌ర్ అభిమానుల్లోని అభిప్రాయం. ఈ ఏడాది పొడ‌వునా జ‌రుగుతోన్న శ‌త‌జ‌యంతి వేడుక‌ల‌కు కూడా ఇన్విటేష‌న్ పంపలేదు. ఇటీవ‌ల విజ‌య‌వాడ‌లో జ‌రిగిన వేడుక‌ల‌కు ర‌జ‌నీకాంత్ (Rajanikanth)ను ఆహ్వానించారు. అక్క‌డి వేడుక‌ల‌కు కూడా జూనియ‌ర్ ను పిల‌వ‌లేదు. కానీ, హైద‌రాబాద్ లో జ‌రిగిన వేడుక‌కు మాత్రం ఇన్విటేష‌న్ పంపారు. స‌రిగ్గా, అదే రోజు జూనియ‌ర్ ఎన్టీఆర్ బ‌ర్త్ డే. ముందుగానే బ‌ర్త్ డే వేడుక‌ల షెడ్యూల్స్ ఫిక్స్ అయ్యాయ‌ని, అందుకే, శ‌తిజ‌యంతికి హాజరు కాలేద‌ని కొంద‌రు చెబుతున్నారు. తాత ఎన్టీఆర్ వేడుక‌ల కంటే త‌న బ‌ర్త్ డే జూనియ‌ర్ కు ముఖ్య‌మా? అనే ప్ర‌శ్న కొంద‌రు సంధిస్తున్నారు. క‌నీసం ఒక వీడియో రూపంలో మెసేజ్ అయినా పెట్ట‌కుండా ఉన్న ఆయ‌న‌కు టీడీపీతో ఎలాంటి సంబంధంలేద‌ని మ‌రికొంద‌రు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Also Read : AP Trend : BJP కి షాక్‌,కామ్రేడ్ల‌తో TDP,JSP కూట‌మి?

అసెంబ్లీలో భువ‌నేశ్వ‌రి(Bhuvaneswari) శీలాన్ని శంకించిన‌ప్పుడు, హెల్త్ యూనివ‌ర్సిటీకి ఎన్టీఆర్ పేరును మార్పు చేసిన‌ప్పుడు జూనియ‌ర్ (Junior NTR) స్పందించిన తీరును గుర్తు చేస్తున్నారు. ఆ రెండు సంద‌ర్భాల్లోనూ కంటె విర‌గ‌కుండా పాము చావ‌కుండా అనే రీతిలో స్పందించాడ‌ని టీడీపీ లీడ‌ర్లు వ‌ర్ల‌, బుద్దా మీడియా ముఖంగా అప్ప‌ట్లో విమర్శించారు. ఆ విష‌యాన్ని గుర్తు చేస్తూ ఇప్పుడు ఎన్టీఆర్ శ‌త‌జ‌యంతి వేడుక‌ల‌కు హాజరుకాని జూనియ‌ర్ ను టీడీపీ బాయ్ క‌ట్ చేయాల‌ని `నారా`(Nara) ఫ్యాన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. విజ‌య‌వాడ‌లో జ‌రిగిన శ‌త‌జ‌యంతి వేడుక‌ల్లో చంద్ర‌బాబు విజ‌న్ ను ప్ర‌శంసిస్తూ ర‌జ‌నీకాంత్ (Rajanikanth)చేసిన వ్యాఖ్య‌ల దుమారం ఇప్ప‌టికీ త‌గ్గ‌లేదు. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు బాగా ఉలిక్కిపడుతూ రాజ‌కీయంగా వెంటాడారు. ఇప్పుడు హైద‌రాబాద్ లో జ‌రిగిన వేడుక‌ల‌కు ప్ర‌భాస్, జూనియ‌ర్ డుమ్మా కొట్ట‌డాన్ని వైసీపీ సానుకూలంగా మ‌లుచుకునే ప‌నిలో ఉంది. మొత్తం మీద ఎన్టీఆర్ శ‌త‌జ‌యంతి వేడుక‌లు రాజ‌కీయ హీట్ ను పెంచే వేదిక‌లుగా మార‌డం గ‌మ‌నార్హం.

Also Read : Jr NTR: ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు నేను రాలేను: జూనియర్