NTR Name Issue : జూనియ‌ర్ నిర‌స‌న‌? వ‌ల్ల‌భ‌నేని లేఖాస్త్రం, క్లైమాక్స్ లో `కొడాలి`!

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి తీసుకున్న నిర్ణ‌యంపై జూనియ‌ర్ ఎన్టీఆర్ బ‌య‌ట‌కు రాబోతున్నార‌ని తెలుస్తోంది.

  • Written By:
  • Publish Date - September 21, 2022 / 01:30 PM IST

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి తీసుకున్న నిర్ణ‌యంపై జూనియ‌ర్ ఎన్టీఆర్ బ‌య‌ట‌కు రాబోతున్నార‌ని తెలుస్తోంది. అంతేకాదు, నంద‌మూరి హీరోలు, కుటుంబాలు బ‌య‌ట‌కు రావడానికి సిద్దం అయ్యాయి. ఎన్టీఆర్ హెల్త్ యూనివ‌ర్సిటీ వ‌ద్ద నిర‌స‌న వ్య‌క్తం చేయడానికి నంద‌మూరి ఫ్యామిలీ సిద్ధం అవుతున్న‌ట్టు స‌మాచారం. జూనియ‌ర్ ఎన్టీఆర్ తొలుత సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి లేఖ రాయ‌డం ద్వారా నిర‌స‌న వ్య‌క్తం చేస్తార‌ని తెలుస్తోంది. ఆ త‌రువాత ఎన్టీఆర్ పేరు తొల‌గింపుపై హైద‌రాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వ‌ద్ద నిర‌స‌న వ్య‌క్తం చేయ‌డానికి సిద్ధం అవుతున్న‌ట్టు స‌మాచారం. హెల్త్ యూనివ‌ర్సిటీ వ‌ద్ద అవ‌స‌ర‌మైతే, నిర‌స‌న వ్య‌క్తం చేస్తార‌ని కూడా తెలుస్తోంది. కేంద్రానికి లేఖ రాయ‌డంతో పాటు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి లేఖ‌లు రాయ‌డం ద్వారా తొలుత జూనియ‌ర్ నిర‌స‌న వ్య‌క్తం చేస్తార‌ని వినికిడి.

ఆర్ హెల్త్ యూనివర్శిటీకి వైఎస్సార్ పేరు పెట్టాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్ ను ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కోరారు. యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరును కొనసాగించే అవకాశాన్ని పరిశీలించాలని విన్నవించారు. పెద్ద మనసుతో ఎన్టీఆర్ జిల్లాను ఏర్పాటు చేశారని, జగన్ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని, విప్లవాత్మకమని చెప్పారు. ఎన్టీఆర్ చొరవతోనే హెల్త్ యూనివర్శిటీ ఏర్పాటయిందని, ఈ నేపథ్యంలో యూనివర్శిటీకి ఆయన పేరునే కొనసాగించాలని కోరారు. ఆయ‌న బాట‌న మాజీ మంత్రి కొడాలి నాని కూడా నడిచే అవ‌కాశం ఉంది. అంతేకాదు, లక్ష్మీపార్వ‌తి కూడా వైసీపీ నుంచి బ‌య‌ట‌కు వ‌స్తార‌ని వైసీపీలో టాక్ న‌డుస్తోంది.

ఇంత‌కాలం చంద్ర‌బాబుకు అట్టీముట్ట‌న‌ట్టు ఉంటోన్న స్వ‌ర్గీయ ఎన్టీఆర్ అభిమానులు ఏక‌మ‌వుతున్నారు. హెల్త్ యూనివ‌ర్సిటికీ ఎన్టీఆర్ పేరును తొల‌గించ‌డం చంద్ర‌బాబుకు రాజ‌కీయంగా క‌లిసొచ్చే అంశంలా క‌నిపిస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగుదేశం పార్టీలో ఎన్టీఆర్ అభిమానులకు, చంద్ర‌బాబు అనుచ‌రుల‌కు మ‌ధ్య స‌న్న‌ని గ్యాప్ ఉండేది. ఇప్పుడు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి తీసుకున్న నిర్ణ‌యంతో అంద‌రూ ఏకం అవుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. అందుకు ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణ వ‌ల్ల‌భ‌నేని వంశీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి లేఖ రాయడం. హెల్త్ యూనివ‌ర్సిటీకి ఎన్టీఆర్ పేరును కొన‌సాగించాల‌ని కోరుతూ లేఖ రాయ‌డం వైసీపీలోని ఎన్టీఆర్ అభిమానుల్ని ఆలోచింప‌చేస్తోంది.

వెనుక‌బడిన వ‌ర్గాల‌కు అండ‌గా ఎన్టీఆర్ నిలిచారు. వాళ్లకు రిజ‌ర్వేష‌న్ల‌ను క‌ల్పించారు. స్థానిక సంస్థ‌ల్లో ఆయ‌నిచ్చిన రిజర్వేష‌న్ల కార‌ణంగా రాజ్యాధికారం దిశ‌గా బీసీలు ప్ర‌స్తుతం ఎదిగారు. అందుకే, టీడీపీకి అనుకూలంగా. బీసీలు నిల‌బ‌డ్డారు. చంద్ర‌బాబు హ‌యాం వ‌చ్చిన త‌రువాత క్ర‌మంగా బీసీలు పార్టీకి దూరం అయ్యారు. ఆ కార‌ణంగా 2019 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి 151 స్థానాల‌ను సంప‌దించుకోగ‌లిగారు. ఎన్టీఆర్ పేరును హెల్త్ యూనివ‌ర్సిటీకి తొల‌గించ‌డాన్ని బీసీలు కూడా ఇప్పుడు నిర‌సిస్తున్నారు. వైసీపీలోని బీసీ లీడ‌ర్లు ఆ పార్టీని వీడ‌డానికి సిద్ధ‌మ‌వుతున్న‌ట్టు తెలుస్తోంది. ఒక పెద్ద రాజ‌కీయ సునామీ దిశ‌గా ఏపీ రాజ‌కీయాలు న‌డిచే అవ‌కాశం ఉంది.