NTR : వైసీపీ సభలో Jr . ఎన్టీఆర్ ఫ్లెక్సీలు..కావాలనే చేస్తున్నారా..?

కొద్దీ నెలల క్రితం వరకు టీడీపీ పార్టీ ఏ సభ పెట్టిన..ఏ ప్రచారం చేసిన జూ. ఎన్టీఆర్ ప్లెక్సీలు దర్శనం ఇచ్చేవి

Published By: HashtagU Telugu Desk
Jr Ntr Flexis In Ycp Meetin

Jr Ntr Flexis In Ycp Meetin

ఎన్నికల ప్రచారం (Election Campaign)లో వైసీపీ (YCP) దేనికైనా సిద్ధం అంటుంది..దాడులు చేయడం…చేయించుకోవడమే కాదు సినీ అభిమానులను సైతం తమవైపు తిప్పుకునేందుకు కూడా వ్యూహాలు చేస్తున్నట్లు అంత మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే తాజాగా వైసీపీ సభలో జూ. ఎన్టీఆర్ (Jr NTR) ప్లెక్సీలతో సందడి చేయడమే. కొద్దీ నెలల క్రితం వరకు టీడీపీ పార్టీ ఏ సభ పెట్టిన..ఏ ప్రచారం చేసిన జూ. ఎన్టీఆర్ ప్లెక్సీలు దర్శనం ఇచ్చేవి. నందమూరి కుటుంబ సభ్యుడు కావడంతో నందమూరి అభిమానులు ఎన్టీఆర్ ప్లెక్సీ ని పట్టుకొని , ఏర్పాటు చేయడం చేస్తుండే వారు. కానీ కొద్దీ నెలలుగా ఎన్టీఆర్ , చంద్రబాబు కు మధ్య విభేదాల కారణంగా ఎన్టీఆర్ ప్లెక్సీ అనేది కనిపించడం లేదు. ఇప్పుడు ఎన్నికల సమరం నడుస్తుంది..అంత కూడా ఎన్టీఆర్ ఈసారి కూటమి కానీ జనసేన కు కానీ సపోర్ట్ పలుకుతారని భావించారు..కానీ ఎన్టీఆర్ మాత్రం ఎప్పటిలాగానే సైలెంట్ గానే ఉన్నాడు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ తరుణంలో ఎన్టీఆర్ అభిమానులను తమ వైపు మలుచుకోవాలని వైసీపీ ప్లాన్ చేస్తుంది. ఎన్టీఆర్ – చంద్రబాబు క్లాష్ ను వాడుకొని..తమకు అనుకూలంగా ఓట్లు వేసుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. అందుకే వైసీపీ సభల్లో , ప్రచారంలో జగన్ , ఎన్టీఆర్ కలిసి ఉన్న ఫొటోస్ , ప్లెక్సీ లతో హడావిడి చేస్తున్నారు. మరి ఇది వైసీపీ పార్టీనే చేస్తుందా..లేక నిజంగా ఎన్టీఆర్ అభిమానులు వైసీపీ సభలకు వెళ్తున్నారో స్పష్టంగా తెలియదు కానీ ఎన్టీఆర్ ప్లెక్సీ లు మాత్రం వైసీపీ సభల్లో హల్చల్ చేస్తున్నాయి. తాజాగా కర్నూలులో జరిగిన జగన్ సభలో జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ జెండాలతో ఫ్యాన్స్ సందడి చేశారు. తమకు సినిమాల్లో హీరోలు జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ అయితే రాజకీయాల్లో మాత్రం జగన్ అంటూ నినాదాలు చేయడం వినిపించింది. గతంలో ఎక్కడా లేని విధంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు జగన్ సభలో కనిపించడం రాజకీయంగా చర్చకు దారి తీస్తుంది. టీడీపీ వర్గీయులు మాత్రం ఎన్టీఆర్ అభిమానులు..ఎప్పటికి టీడీపీ కి సపోర్ట్ గానే ఉంటారని అంటున్నారు.

Read Also : Allu Arjun : వాళ్ళ కోసం పది లక్షలు డొనేట్ చేసిన అల్లు అర్జున్..

  Last Updated: 09 May 2024, 05:18 PM IST