Site icon HashtagU Telugu

NTR District : ఎన్టీఆర్ జిల్లాపై `నంద‌మూరి` మౌనం

Jr Ntr Balayya Puradeswari

Jr Ntr Balayya Puradeswari

విజ‌య‌వాడ కేంద్రంగా పెట్టే ఎన్టీఆర్ జిల్లా బీజేపీలోనూ ర‌చ్చ రేపుతోంది. ఆ పార్టీకి చెందిన జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి పురంధ‌రేశ్వ‌రి ఏపీ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాన్ని స్వాగ‌తించింది. కానీ, అదే పార్టీకి చెందిన న‌రేంద్ర మాత్రం వంగ‌వీటి రంగా పేరు పెట్టాల‌ని డిమాండ్ చేస్తున్నాడు. ఆ మేర‌కు జ‌గ‌న్ స‌ర్కార్ కు లేఖ కూడా రాశాడు. ఏపీ శాఖ మాత్రం ఈ విష‌యంలో ఇంకా జోక్యం చేసుకోలేదు. ఒక నిర్ణ‌యానికి రాలేక‌పోతోంది.
రంగా-రాధ మింత్ర మండ‌లి అధ్యక్షుడిగా ఉన్న న‌రేంద్ర ఏపీ బీజేపీలో కీల‌క లీడ‌ర్. విజ‌య‌వాడలోని బీజేపీ కార్య‌క్ర‌మాల్లో చురుగ్గా ఉంటాడు. ఇటీవ‌ల రాధాపై జ‌రిగిన రెక్కీ విష‌యంలోనూ జోక్యం చేసుకున్నాడు. రెక్కీ నిర్వ‌హించిన వాళ్ల‌కు వార్నింగ్ ఇచ్చాడు. త‌మ్ముడు రాధాపై చేయ్యేస్తే తానున్నానంటూ ప్ర‌త్య‌ర్థుల‌కు హెచ్చ‌రిక చేశాడు. తొలి నుంచి రంగా-రాధ మిత్ర మండ‌లిని చురుగ్గా నిర్వ‌హిస్తున్నాడు. వంగ‌వీటి రంగా పేరు మీద ప‌లు కార్య‌క్ర‌మాల‌ను చేశాడు. విజ‌య‌వాడ కేంద్రంగా వంగ‌వీటి రంగాకు ఉన్న పేరును మ‌రించి పెంచాడు న‌రేంద్ర.

బీజేపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఉన్న పురంధ‌రేశ్వ‌రి ప‌లుమార్లు ఎన్టీఆర్ కు భార‌త‌ర‌త్న ఇవ్వాల‌ని డిమాండ్ చేసింది. ఆమె కేంద్ర మంత్రిగా ఉన్న‌ప్పుడు అందుకోసం ప్ర‌య‌త్నం చేసింది. దాదాపు ప‌దేళ్ల పాటు ఆమె కేంద్ర మంత్రిగా కాంగ్రెస్ లో ప‌నిచేసింది. ఆ స‌మ‌యంలో పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లో ఎన్టీఆర్ విగ్ర‌హాన్ని పెట్టించింది. ఆ విగ్ర‌హాన్ని పెట్టించ‌డానికి కూడా చాలా ఏళ్లు ప‌ట్టింది. వాజ్ పేయ్ ఆధ్వ‌ర్యంలోని ఎన్డీఏ ఉన్న‌ప్ప‌టి నుంచి ఎన్టీఆర్ విగ్ర‌హాన్ని పార్ల‌మెంట్ లో పెట్టాల‌ని ప్ర‌య‌త్నం జ‌రిగింది. ఆనాడు ఎన్డీఏలో కీల‌కంగా టీడీపీ ఉంది. అయిన‌ప్ప‌టికీ విగ్ర‌హాన్ని పెట్టించ‌లేక‌పోయింది. ఆ త‌రువాత కేంద్ర మంత్రిగా పురంధ‌రేశ్వ‌రి పార్ల‌మెంట్ లో ఎన్టీఆర్ విగ్ర‌హాన్ని పెట్టించ‌డంలో విజ‌యం సాధించింది.

ఇక ఇప్పుడు ఆమె ఎన్టీఆర్ పేరును విజ‌య‌వాడ కేంద్రంగా ఏర్పడే జిల్లాకు పెట్ట‌డం మంచి ప‌రిణామంగా భావిస్తోంది. జ‌గ‌న్ స‌ర్కార్ కు అభినంద‌న‌లు తెలిపింది. ఎన్టీఆర్ కుమారులుగానీ, జూనియ‌ర్ ఎన్టీఆర్ గానీ, టీడీపీ నేత‌లుగానీ దీనిపై సంపూర్ణంగా స్పందించ‌లేదు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు మాత్రం అటూఇటూ కాకుండా స్పందించాడు. ఎన్టీఆర్ విగ్ర‌హాల‌ను జ‌గ‌న్ స‌ర్కార్ కూల్చ‌డాన్ని తెర‌మీదుకు తీసుకొచ్చాడు. ఎన్టీఆర్ అంటే అంద‌రికీ అభిమానం అంటూనే ఏపీ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాన్ని నేరుగా స్వాగ‌తించ‌లేక‌పోయాడు. ఇక ఎన్టీఆర్ కుమారుడు బాలక్రిష్ణ కూడా ఏపీ ప్ర‌భుత్వం నిర్ణ‌యాన్ని అభినందించ‌లేక పోతున్నాడు. హిందూపురం కేంద్రంగా జిల్లాను పెట్టాల‌ని డిమాండ్ చేస్తున్నాడు. పుట్ట‌ప‌ర్తి కేంద్రంగా స‌త్య‌సాయి జిల్లాగా హిందూపురం లోక్ స‌భ ప‌రిధిని చేయ‌డానికి జ‌గ‌న్ స‌ర్కార్ సిద్ధం అయింది. ఆ క్ర‌మంలో హిందూపురం కేంద్రంగా జిల్లాను పెట్టాల‌ని మాత్ర‌మే రియాక్ట్ అయిన బాల‌య్య ఏపీ ప్ర‌భుత్వం ఎన్టీఆర్ జిల్లాను పెడుతున్న దానిపై సైలెంట్ గా ఉన్నాడు.

నంద‌మూరి ఫ్యామిలీలో పురంధ‌రేశ్వ‌రి మాత్ర‌మే నేరుగా పార్టీ స్టాండ్ ను కాద‌ని ఏపీ స‌ర్కార్ నిర్ణ‌యానికి స్వాగ‌తం ప‌లికింది. కానీ, బీజేపీలోని ఒక వ‌ర్గం మాత్రం ఆమె స్టేట్ మెంట్ పై గుర్రుగా ఉన్నార‌ని తెలుస్తోంది. పార్టీ తీర్మానం చేయ‌కుండా జాతీయ ప్ర‌ధాని కార్య‌ద‌ర్శి హోదాలో నేరుగా ఎన్టీఆర్ జిల్లాకు స్వాగ‌తం ప‌లక‌డం పార్టీకి రాజ‌కీయంగా న‌ష్టం జ‌రుగుతుంద‌ని కొంద‌రి అభిప్రాయం. అంతేకాకుండా బీజేపీ నేత న‌రేంద్ర ఏపీ స‌ర్కార్ కు లేఖ రాయ‌డాన్ని కూడా సీరియ‌స్ గా తీసుకుంది మొత్తం మీద విజ‌య‌వాడ కేంద్రంగా ఏర్ప‌డ‌బోయే ఎన్టీఆర్ జిల్లా బీజేపీలో రాజ‌కీయ‌
చిచ్చును రేపింది. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఇలాంటి అల‌జ‌డిపై ఎలా రియాక్ట్ అవుతాడో..చూడాలి.