Site icon HashtagU Telugu

Super Biker : సూపర్ బైకర్ నవీన్.. కృత్రిమ కాలితో ప్రపంచంలోనే ఎత్తైన ప్రాంతానికి

Naveen Kumar Hero Magnetic Expedition Worlds Highest Point Andhra Pradesh Sri Sathya Sai District

Super Biker : తెలుగు యువతేజం హెచ్‌జే నవీన్‌కుమార్‌.. ‘ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌‌’లో చోటును సంపాదించారు. తాను దివ్యాంగుడిని అనే విషయాన్ని మర్చిపోయి.. ప్రొఫెషనల్‌ రైడర్లకు మించిన రేంజులో కొండలోయలు, ఇసుక దిబ్బలు, నీటిగుంతల నడుమ నుంచి బైక్‌ రైడింగ్‌ చేశారు. నవీన్‌ కృత్రిమ కాలితో ఆరు రోజుల పాటు బైక్‌పై 2,361 కి.మీ మేర ప్రయాణించి ప్రపంచంలోనే ఎత్తైన మార్గాల్లో ఒకటైన ఇండియా- చైనా బార్డర్‌లోని ఉమ్‌లింగ్‌లా ప్రాంతానికి చేరుకున్నారు. దీంతో ఆ ప్రాంతానికి చేరుకున్న తొలి దివ్యాంగుడిగా ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌‌లో హెచ్‌జే నవీన్‌కుమార్‌‌కు చోటు లభించింది.

Also Read :5 Things In Dreams: కలలో మీకు ఈ 5 వస్తువులు కనిపిస్తున్నాయా?

వివరాల్లోకి వెళితే.. హెచ్‌జే నవీన్‌కుమార్‌‌(Super Biker) ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం మిట్టమీదపల్లి వాస్తవ్యులు. ఆయన ఎంబీఏ చేశారు. ప్రస్తుతం బెంగళూరులోని హెచ్‌ఎస్‌బీసీ బ్యాంకులో జాబ్ చేస్తున్నారు. 2016లో ఒక రోడ్డు యాక్సిడెంట్‌లో నవీన్‌ తన ఎడమ కాలిని కోల్పోయారు. ఈ దారుణ ఘటనతో ఆయన రెండు నెలల పాటు మంచానికే పరిమితం కావాల్సి వచ్చింది. ఆరోగ్యం కోలుకున్నాక..ఆయన కృత్రిమ కాలిని వేయించుకున్నారు. నవీన్‌ తనకు కృత్రిమ కాలు ఉందనే విషయాన్ని మర్చిపోయి బైక్ రైడింగ్  చేస్తుండేవారు. దీన్ని చూసి అందరూ ఆయన్ను మెచ్చుకునేవారు.

Also Read :Gold: గ‌త వారం రోజులుగా త‌గ్గిన బంగారం ధ‌ర‌లు.. ఈ వారం ప‌రిస్థితి ఎలా ఉండ‌నుంది?

హీరో కంపెనీ బైక్‌రైడింగ్‌పై మ్యాగ్నెటిక్‌ ఎక్స్‌పెడిషన్‌‌ను ఈ ఏడాది జులైలో నిర్వహించింది. దీనిలో 20 మంది రైడర్లు పాల్గొన్నారు. వారిలో మన నవీన్‌కుమార్‌ ఒకరు. ఆ పోటీలలో నవీన్ సత్తాచాటారు.  6 రోజుల పాటు బైక్‌పై కనుమ దారుల్లో 2,361 కి.మీ మేర ప్రయాణించి ప్రపంచంలోనే ఎత్తైన మార్గాల్లో ఒకటైన ఇండియా- చైనా బార్డర్‌లోని ఉమ్‌లింగ్‌లా ప్రాంతానికి చేరుకున్నారు.దివ్యాంగులు ఎవ్వరూ అక్కడికి చేరుకోలేదు. దీంతో సరికొత్త రికార్డు నవీన్ సొంతమైంది. ఉమ్‌లింగ్‌లాలో సరిగ్గా ఊపిరాడదు. ఎందుకంటే అక్కడ ఆక్సిజన్‌ లెవల్స్  తక్కువగా ఉంటాయి. టెంపరేచర్ అయితే నిత్యం మైనస్‌‌లలోనే ఉంటుంది. మీ నెక్ట్స్ టార్గెట్ ఏమిటి అని నవీన్‌ను ప్రశ్నిస్తే.. ‘‘కశ్మీర్‌ టు కన్యాకుమారికి బైక్‌ రైడ్‌ చేయాలని అనుకుంటున్నా’’ అని ఆయన బదులిచ్చారు. అంతేకాదు 2026లో జరిగే ఏషియన్‌ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌‌ కోసం ఇండియన్‌ అథ్లెటిక్‌ అకాడమీలో శిక్షణ పొందుతున్నానని నవీన్ తెలిపారు. గతంలో తాను బ్యాడ్మింటన్‌లో జాతీయ స్థాయిలో ఆడానని అంటున్నారు.