Jogi Ramesh : కూటమిలోకి జోగి రమేష్..?

Jogi Ramesh : జగన్‌కు నమ్మిన బంటుగా ఉంటూ.. ఆయన విశ్వాస పాత్రుడిగా మెలిగిన జోగి..ఇప్పుడు బయటకు వచ్చేందుకు సిద్ధమయ్యారని తెలుస్తుంది

Published By: HashtagU Telugu Desk
Jogi Celebrations

Jogi Celebrations

ఎన్నికల్లో జగన్ (Jagan) కు ప్రజలు భారీ షాక్ ఇస్తే…ఇప్పుడు వరుస పెట్టి సొంత పార్టీ నేతలు..కుటుంబ సభ్యులు..నమ్మిన నేతలు షాకులు ఇస్తున్నారు. ఎన్నికల్లో వైసీపీ ఓటమి తప్పదని గ్రహించిన కొంతమంది నేతలు..ఎన్నికలకు ముందే వైసీపీ కి బై బై చెప్పి ..కూటమి లో చేరి టికెట్స్ సాధించి..ఇప్పుడు పదవుల్లో ఉంటె..ఇంకొంతమంది వైసీపీ నేతలు ఓటమి తర్వాత బయటకు రావడం స్టార్ట్ చేసారు. ఇప్పటికే కీలక నేతలు బయటకు రాగా..ఇప్పుడు ఉన్న కొద్దీ మంది కూడా జగన్ కు షాక్ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. వారిలో జోగి రమేష్ కూడా ఒకరు అని ప్రచారం జరుగుతుంది.

జగన్‌కు నమ్మిన బంటుగా ఉంటూ.. ఆయన విశ్వాస పాత్రుడిగా మెలిగిన జోగి (Jogi Ramesh)..ఇప్పుడు బయటకు వచ్చేందుకు సిద్ధమయ్యారని తెలుస్తుంది. టీడీపీ లేదా జనసేనలోకి చేరేందుకు జోగి రమేశ్ మంతనాలు కొనసాగిస్తున్నట్లు వినికిడి. వైసీపీ పార్టీలో నోరున్న నేతలకే కీలక పదవులు అప్పగించారు జగన్. దీంతో చైనా స్థాయి నేతల నుండి పెద్ద స్థాయి నేతల వరకు జగన్ పై ప్రశంసలు , ప్రత్యర్థి పార్టీల నేతలపై విమర్శలు చేస్తూ జగన్ మెప్పు పొందారు. అలాంటి వారిలో జోగి రమేశ్ అగ్రస్థానంలో ఉండేవారు.

వైఎస్ జగన్ కళ్లలో ఆనందం చూడడం కోసం జోగి రమేశ్ ఎంత చేయాల్లో అంత చేసారు. తన స్థాయిని మరచికూడా చంద్రబాబు , పవన్ కళ్యాణ్ పై నోరు పారేసుకున్నాడు. చంద్రబాబు నివాసంపై దాడికి తెగబడడంతోపాటు వివిధ సందర్భాల్లో పలు వేదికలపై నుంచి జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌పై వ్యక్తిగత విమర్శలకు దిగడం వరకు ఎంత చేయాల్లో అంతా చేసాడు. అలాంటి వ్యక్తి తమ పార్టీలోకి వస్తానంటే అధినేతలు ఓకే చెపుతారా..? పార్టీ నేతలు ఒప్పుకుంటారా..? అనేది ఆసక్తిగా మారింది. అయితే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు..అలానే మిత్రులు ఉండరు..ప్రభుత్వం ఎవరిదీ ఉంటె వారికీ కొమ్ముకాయడం చేస్తుంటారు. మరి జోగి పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.

Read Also : MLC by election : ఏపీలో టీచర్‌ ఎమ్మెల్సీ బైపోల్ షెడ్యూల్‌ విడుదల

  Last Updated: 04 Nov 2024, 05:02 PM IST