Site icon HashtagU Telugu

Jogi Ramesh : జగన్ భక్తుడికి టికెట్ లేనట్లే..?

Jogi Ramesh Ticket Replace

Jogi Ramesh Ticket Replace

ఏపీలో మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ క్రమంలో వైసీపీ అధినేత , సీఎం జగన్ (Jagan) అభ్యర్థుల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణ లో రీసెంట్ గా జరిగిన ఎన్నికల్లో బిఆర్ఎస్ (BRS) పార్టీ మంత్రులకు , ఎమ్మెల్యేలకు ప్రజలు షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. నియోజకవర్గాల్లో ఆయా నేతలకు వ్యతిరేకత ఉన్నప్పటికీ..అధినేత కేసీఆర్ అవేమి పట్టించుకోకుండా మరోసారి సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్ ఇచ్చారు. దీంతో ప్రజలు వారిని ఓడగొట్టి..ఇంట్లో కూర్చుపెట్టారు. ముఖ్యంగా బిఆర్ఎస్ ఓటమికి కారణం..సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్ ఇవ్వడమే…అందుకే జగన్ తనకు అలాంటి పరిస్థితి రాకూడదని..చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వడం లేదు. ఇందులో ప్రస్తుత మంత్రులు కూడా ఉన్నారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు దాదాపు 90 కి పైగా ఎమ్మెల్యేల ను మార్చేస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

వీరిలో జగన్ భక్తుడు కూడా ఉన్నాడని అంటున్నారు. వైఎస్ జగన్‌పై ఎవరు విమర్శలు చేసినా ఆ భక్తుడు అసలు తట్టుకోలేడు. మైకుల ముందు వచ్చి ఊదరగొడతాడు. వీరవిధేయుడు కావడంతో జగన్‌ ఆయనకు కేబినెట్ విస్తరణలో చోటు కల్పించారు. రాష్ట్ర గృహనిర్మాణ శాఖమంత్రిగా కీలక శాఖను అప్పగించారు. అయినప్పటికీ ఆ శాఖకు న్యాయం చేయడం మానేసి జగన్ భజన చేయడమే పనిగా పెట్టుకున్నాడు. దీంతో నియోజకవర్గాలో పూర్తి వ్యతిరేకత వచ్చింది. కనిపిస్తే కొడతాం అన్నట్లు నియోజకవర్గ ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. ఇంతకీ ఆ మంత్రి ఎవరో తెలిసే ఉంటుంది కదూ… జోగి రమేశ్. నియోజవర్గంలో ఉన్న వ్యతిరేకత దృష్ట్యా ఆయనకు టికెట్ ఇచ్చేదిలేదని జగన్ తేల్చి చెప్పాడట. జోగి రమేశ్‌ (Jogi Ramesh) స్థానంలో మహిళా నాయకురాలికి టికెట్ ఇస్తారనే ప్రచారం జరుగుతుంది.

కృష్ణా జిల్లాపరిషత్ చైర్‌పర్సన్ ఉప్పాల హారికను బరిలోకి దించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. వచ్చే ఎన్నికల్లో పెడన నియోజకవర్గం నుంచి ఆమెకు టికెట్ ఇస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. పెడనలో క్షేత్ర స్థాయిలో జరిగిన పలు సర్వేలలో మంత్రి జోగి రమేశ్ గ్రాఫ్ బాగాలేదని నిర్ధారణ అయ్యింది. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా ఉప్పాల హారికపై సర్వే నిర్వహించగా ఆమెకు గ్రాఫ్ బాగా పెరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అయితే ఉప్పాల హారిక కి టికెట్ ఫిక్స్ అని అంత నమ్ముతున్నారు. మరి జోగి రమేశ్ రాజకీయ భవిష్యత్ ఏంటనే దానిపై పొలిటికల్ సర్కిల్‌లో ఆసక్తికర చర్చ జరుగుతుంది.

Read Also : ABP- C Voter Survey : లోక్‌సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ దే విజయం అంటున్న ఏబీపీ-సీ ఓటర్ సర్వే