గత రెండు రోజులుగా వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ (Jogi Ramesh) ను పోలీసులు అరెస్ట్ (Police Arrest) చేయబోతున్నారనే వార్త వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. చంద్రబాబు ఫై ఇంటిఫై దాడికి యత్నం తో పాటు అగ్రి గోల్డ్ భూముల వ్యవహారం , అలాగే విజయవాడ లో ఓ భూమిని అక్రమంగా రిజిస్టేషన్ చేసుకున్నారనే కేసు..ఇలా పలు కేసుల్లో భాగంగా జోగి రమేష్ ను అదుపులోకి తీసుకోబోతున్నారనే ప్రచారం ఉపందుకుంది. ఈ తరుణంలో ఈరోజు విజయవాడలో మీడియాతో మాట్లాడారు.
We’re now on WhatsApp. Click to Join.
లోకేష్ రెడ్ బుక్ అంటూ ఎలా అయినా కేసులు పెట్టి అరెస్ట్ చేయాలనీ చూస్తున్నారని మహా అయితే అరెస్ట్ చేసి 2,3 నెలలు జైల్లో పెడతారు అంతే కదా అంటూ జోగి రమేష్ వ్యాఖ్యానించారు. తనపై వస్తున్న ఆరోపణలు అన్నీ అవాస్తవమని , సీఐడీ సీజ్ చేసిన అగ్రిగోల్డ్ భూములు ఎలా అమ్ముతారని జోగి రమేష్ ప్రశ్నించారు. సీజ్ చేసిన భూమి నెంబర్ పై అమ్మకాలు జరగవన్నారు.ఇక జోగి మాటలు విన్న వారంతా నవ్వుకుంటున్నారు. పైకి మేకపోతు గాంభీర్యం చూపించిన జోగి కి భయం పట్టుకుందని..అందుకే ముందస్తు బెయిల్ కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని టీడీపీ శ్రేణులు కామెంట్స్ చేస్తున్నారు. కేవలం ఈయనకు మాత్రమే కాదు గత ప్రభుత్వం లో నీరు పారేసుకున్న నేతలందర్నీ మడతపెట్టేందుకు కూటమి సిద్ధం అవుతుంది. అందుకే చాలామంది నోరు మోసుకొని కూర్చున్నారు.
Read Also : Vasthu Tips: నిద్ర లేవగానే పొరపాటున కూడా ఈ మూడింటిని అస్సలు చూడకండి.. చూసారో దరిద్రమే!