Site icon HashtagU Telugu

Jogi Ramesh Celebrations : చంద్రబాబు భయపడ్డాడంటూ జోగి సంబరాలు

Jogi Celebrations

Jogi Celebrations

ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో కూటమి పార్టీలు జోరు పెంచుతున్నాయి. వరుసపెట్టి అభ్యర్థులను ప్రకటిస్తూ ప్రచారానికి ముమ్మరం చేస్తున్నాయి. తాజాగా టీడీపీ (TDP) ఈరోజు నాల్గో జాబితా (3rd List) విడుదల చేసింది. ఈ లిస్ట్ పలువురు సీనియర్లకు షాక్ ఇవ్వగా..మరికొంతమంది ఆశావహులకు సంతృప్తి పరిచారు. ముఖ్యంగా పెనమలూరు స్థానానికి (Penamaluru Assembly constituency) ఎవర్ని ఎంపిక చేస్తారో అని అంత ఆసక్తిగా ఎదురుచూసారు. ఈ స్థానం కోసం బోడె ప్రసాద్‌ (Bode Prasad) ఎదురుచూస్తుండగా..ఆయనకే ఖరారు చేయడం ఆయన వర్గీయులు సంబరాలు చేసుకుంటుంటే..అటు వైసీపీ అభ్యర్థి జోగి (Jogi Ramesh) సైతం విజయం తనదే అని ఇప్పటి నుండి సంబరాలు మొదలుపెట్టారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్‌ మాట్లాడుతూ.. చంద్రబాబు అనేక సర్వేలు చేయించాడు.. నా మీద పోటీ చేయడానికి చంద్రబాబు భయపడ్డాడని ఎద్దేవా చేశారు. అయితే, గత్యంతరం లేక చివరికి బోడె ప్రసాద్‌కి సీటు ఇచ్చాడని పేర్కొన్నారు.. సీఎం జగన్ పాలనో పార్టీలకు అతీతంగా ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించామన్న ఆయన.. కుప్పంలో చంద్రబాబు , మంగళగిరిలో లోకేష్, అలాగే పిఠాపురంలో పవన్‌ కల్యాణ్‌ కూడా ఓడిపోతారని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ లేకుండా జనాలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ ఎన్నికలు పేదలకు, పెత్తందారులకు జరిగే ఎన్నికగా అభివర్ణించారు.. ఈ ఎన్నికల్లో రాష్ట్రంలోని 175 స్థానాల్లో వైసీపీ విజయం సాదిస్తుందని నమ్మకాన్ని వ్యక్తం చేశారు. మరి జోగి నమ్మకం నెరవేరుతుందా అనేది చూడాలి.

Read Also : PAN Card Number: పాన్‌కార్డ్‌లోని ఈ 10 అంకెల అర్థం ఏంటో తెలుసా..?