Site icon HashtagU Telugu

Jogi Ramesh : టీడీపీ ర్యాలీలో జోగి రమేష్..ఇక టీడీపీ లో చేరినట్లేనా..?

Jogi Tdp

Jogi Tdp

ఉమ్మడి కృష్ణా జిల్లాలోని నూజివీడులో జరిగిన గౌతు లచ్చన్న విగ్రహ ఆవిష్కరణ (Invention of Gautu Lacchanna statue) కార్యక్రమంలో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్‌ (Jogi Ramesh) పాల్గొనడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపింది. టీడీపీ నేతలతో కలిసి ఆయన ర్యాలీలో కనిపించడంతో జోగి రమేష్‌ టీడీపీలో చేరతారన్న ఊహాగానాలు మరింత జోరు అందుకున్నాయి. ఇప్పటికే పలువురు వైసీపీ నేతలు..వైసీపీ కి గుడ్ బై చెప్పి , టీడీపీ లో చేరగా..ఇప్పుడు జోగి రమేష్‌ టీడిపి నేతల ర్యాలీలో పాల్గొనేసరికి..త్వరలోనే వైసీపీ పార్టీకి పెద్ద షాక్‌గా మారబోతుందని అంత మాట్లాడుకుంటున్నారు.

జోగి రమేష్‌ వైసీపీ ప్రభుత్వానికి అత్యంత విధేయుడిగా పేరు పొందారు. ఆయనను మంత్రిగా నియమించడంలోనూ, వివాదాల్లోనూ జగన్‌ మోహన్‌ రెడ్డి ఎల్లప్పుడూ జోగి రమేష్‌ వైపే నిలిచారు. అయితే, ఇటీవల ఆయన రాజకీయంగా వెనుకంజ వేయడం, కొత్తగా టీడీపీ నేతలతో కలిసి కనిపించడం, ఎన్నికల సమీపంలో కొత్త రాజకీయ జోరుకు దారితీస్తోంది. ఈ పరిణామాలు జగన్‌ శ్రేణులను ఆలోచనలో పడేశాయి. జోగి రమేష్‌ కేవలం గౌతు లచ్చన్న విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్నారని, దీన్ని రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం లేదని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఇది పూర్తిగా ప్రైవేట్ కార్యక్రమమని, టీడీపీ లేదా ఇతర పార్టీలతో దీనికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తున్నారు. అయితే, జగన్‌ మోహన్‌ రెడ్డి ఈ అంశాన్ని ఎలా స్వీకరిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

Read Also : Balakrishna : కోట్లు ఇస్తామన్న బాలకృష్ణ ఆ పని చేయలేదట