Site icon HashtagU Telugu

Jogi Ramesh : మాజీ మంత్రి జోగి అరెస్ట్ తప్పదా..?

Jogi Arest

Jogi Arest

వైసీపీ (YCP) నేతల్లో భయం మొదలైంది..ఎవర్ని..ఎప్పుడు ..ఏ కేసులో అరెస్ట్ చేస్తారో అర్ధం కావడం లేదు. కేవలం అరెస్టులు కాదు గడిచిన ఐదేళ్లలో కట్టుకున్న నిర్మాణాలు , ఏర్పాటు చేసుకున్న ఫ్యాక్టరీ లు , దోచుకొని , దాచుకున్న సొమ్ము ఇలా దేనిని అధికార పార్టీ వదిలేలా లేదు..ఇప్పుడు ఏంచేయాలో అని జుట్టు పీక్కుంటున్నారు. అధికారం మా చేతిలో ఉంది..వచ్చేది కూడా మా జగన్నే..మీము చెప్పేది వేదం..చేసేదే పాలనా అన్నట్లు గత ప్రభుత్వ నేతలు రెచ్చిపోయారు. ఇలా చెయ్యకండి..రోజులు మారతాయి..ఎప్పుడు ఏంజరుగుతుందో చెప్పలేం..ఓడలు బండ్లు అవుతాయి..గుర్తుపెట్టుకోండి అని అప్పటి ప్రతిపక్ష పార్టీ నేతలు , రాజకీయ విశ్లేషకులు ఎంత చెప్పిన వినలేదు. మాకు అడ్డు లేదు..మమ్మల్ని ఆపే వారు లేరంటూ రెచ్చిపోయారు. ఇక ఇప్పుడు శిక్ష అనుభవించినేందుకు సిద్ధం అవుతున్నారు.

అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్..ఎవర్ని వదిలిపెట్టద్దంటూ..పోలీస్ శాఖకు గట్టి హెచ్చరికలు జారీ చేసింది. గడిచిన ఐదేళ్లలో వైసీపీ నేతలు ఎవరెవరు ఎన్ని అక్రమాలు చేసారో..? ఎన్ని దాడులు చేసారో..? ఎక్కడ అక్రమ ఆస్తులు సంపాదించారో..? ఎక్కడెక్కడ భూ కబ్జాలు చేసారో అవన్నీ వెలికితీయాలని..వాటిపై దర్యాప్తు చేసి..అక్రమంగా అన్యాయంగా లాక్కున్న..దోచుకున్న ..దాడులు చేసిన వారిపై కేసులు పెట్టాలని ఆదేశించింది. ఈ క్రమంలో మాజీ మంత్రి జోగి రమేష్ ఫై పోలీసులు అనేక కేసులు నమోదు చేసారు.

We’re now on WhatsApp. Click to Join.

2021 సెప్టెంబర్‌లో జోగి రమేష్ (Jogi Ramesh) ఆధ్వర్యంలో వైసీపీ నేతలు అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంటిపై దాడికి వెళ్లారు. కోడెల శివప్రసాద్ వర్ధంతి నాడు అయ్యన్న పాత్రుడు మాజీ సీఎం జగన్ ను కించ పరిచారని.. ఆయనతో చంద్రబాబే వ్యాఖ్యలు చేశారని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ జోగి రమేష్ పెద్ద ఎత్తున కార్లతో చంద్రబాబు ఇంటి మీదకు వెళ్లారు. ఆ సమయంలో టీడీపీ నేతలు కూడా రావడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ప్రతిపక్ష నేత ఇంటిపై ఇలా అధికార పార్టీ నేత దాడికి రావడంతో అప్పట్లో సంచలనం సృష్టించింది. అయితే పోలీసులు వైసీపీ నేతలపై కేసులు పెట్టకుండా.. టీడీపీ నేతలపై మాత్రం కేసులు పెట్టారు. ఇదెక్కడి న్యాయం అని ప్రశ్నించిన అప్పటి ప్రభుత్వం , పోలీసులు పట్టించుకోలేదు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్..ఆ కేసు ను రీ ఓపెన్ చేసి..జోగి ఫై కేసు నమోదు చేసింది. అలాగే అగ్రిగోల్డ్‌ ఆస్తుల్లో సీజ్‌ చేసిన భూమిని అక్రమంగా రాయించుకున్నట్లు జోగి ఫ్యామిలీపై ఆరోపణలున్నాయి. అదే కాకుండా విజయవాడ పాయకరావుపేట సమీపంలో 26 సెంట్ల స్థలాన్ని సర్వే నెంబర్‌ మార్పుతో జోగి రిజిస్టేషన్ చేయించుకున్నాడని ఆరోపణ కూడా ఉంది. ఈ క్రమంలో జోగి బాధితులు వరుసగా పిర్యాదులు చేస్తుండడం తో జోగి ఫై వరుసగా పోలీసులు కేసులు నమోదు చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం చంద్రబాబు ఇంటిపై దాడి కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ కోసం జోగి కోర్ట్ ను ఆశ్రయించారు.దీనిపై కోర్ట్ కాసేపట్లో తీర్పు ఇవ్వనుంది.

Read Also : Prabhas Kalki Effect Raja Saab Next Level Business : కల్కి ఎఫెక్ట్.. రాజా సాబ్ బిజినెస్ అదుర్స్..!