Site icon HashtagU Telugu

Agrigold Scam : ఆగస్టు 23 వరకు జోగి రాజీవ్ రిమాండ్

Jogi Rajeev Remand

Jogi Rajeev Remand

అగ్రిగోల్డ్ భూముల స్కామ్ కేసు(Agrigold Scam)లో జోగి రాజీవ్ (Jogi Rajeev ) కు ఏసీబీ కోర్ట్ (ACB Court) రిమాండ్ విధించింది. గడిచిన ఐదేళ్లలో అధికార మదంతో వైసీపీ నేతలు రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ భూములే కాదు ప్రవైట్ భూములను సైతం కబ్జాలు చేసి అనేక అక్రమాలకు పాల్పడ్డారు. ఇక ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్..గడిచిన ఐదేళ్లలో జరిగిన అక్రమాలఫై దర్యాప్తు మొదలుపెట్టి..అరెస్టులు చేస్తూ వస్తుంది. ఈ క్రమంలో జోగి రమేష్ ఫ్యామిలీ కి వరుస షాకులు తగులుతున్నాయి. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారం వారి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది.

We’re now on WhatsApp. Click to Join.

అంబాపురం వద్ద భూములు కొనుగోలు చేసి సీఐడీ జప్తులో ఉన్న అగ్రిగోల్డ్‌ భూముల సర్వే నెంబర్లలోకి మార్చి జోగి రమేష్ తనయుడు జోగి రాజీవ్ విక్రయాలు జరిపినట్లు ఏసీబీ గుర్తించి అతన్ని మంగళవారం అరెస్ట్ చేసింది. ఇతడి తో పాటు సర్వేయర్ రమేశ్‌ను ను సైతం అరెస్టు చేశారు. వైద్యపరీక్షల కోసం ఆస్పత్రికి తరలించిన అధికారులు, విజయవాడ ఏసీబీ కోర్టులో వారిని హాజరుపరిచారు. జోగి రాజీవ్ రిమాండ్‌పై ఏసీబీ కోర్టులో వాదనలు జరిగాయి. అనంతరం ఈ నెల 23 వరకు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

కాగా ఈ కేసులో కొందరు నిందితులు ఉన్నారు. 1. జోగి రాజీవ్, 2. జోగి సోదరుడు వెంకటేశ్వరరావు, 3. అడుసుమిల్లి మోహన రంగ దాసు, 4. వెంకట సీతామహాలక్ష్మీ, 5. సర్వేయర్ దేదీప్య 6. మండల సర్వేయర్ రమేశ్, 7. డిప్యూటీ తహశీల్దార్ విజయ్ కుమార్, 8. విజయవాడ రూరల్ ఎమ్మార్వో ( MRO) జాహ్నవి, 9. విజయవాడ రిజిస్ట్రార్ నాగేశ్వరరావులు ఈ జాబితాలో ఉన్నారని అధికారులు తెలిపారు. కాగా మిగతా వారిని పోలీసులు త్వరలో విచారించే అవకాశం ఉంది.

Read Also : Taking Care Of Lips: మీ పెద‌వులు న‌ల్ల‌గా ఉన్నాయా..? అయితే ఇలా చేయండి..!