అగ్రిగోల్డ్ భూమలు కేసు (Agrigold Scam)లో మాజీ మంత్రి జోగి రమేష్ కొడుకు జోగి రాజీవ్ (Jogi Rajeev) ను ఏసీబీ (ACB) అధికారులు అరెస్ట్ చేసారు. ఏపీలో అధికారం మారడం తో వైసీపీ నేతలకు చుక్కలు చూపిస్తుంది కూటమి సర్కార్. గడిచిన ఐదేళ్లల్లో వైసీపీ నేతల ఆగడాలకు చెక్ పెడుతూ..ఎక్కడిక్కడే అరెస్ట్ ల పర్వం కొనసాగిస్తున్నారు. అలాగే భూకబ్జాలకు పాల్పడిన వారిపై కూడా కేసులు పెడుతూ..అక్రమ కట్టడాలను కూల్చేస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇదిలా ఉంటె అగ్రిగోల్డ్ భూమలు కేసుకు సంబంధించి మాజీ మంత్రి జోగి రమేష్ కొడుకు జోగి రాజీవ్ ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంట్లో సోదాలు జరిపారు. దాదాపు 15 మంది ఏసీబీ అధికారులు ఈ సోదాల్లో పాల్గొన్నారు. సీఐడీ జప్తులో ఉన్న అగ్రిగోల్డ్ భూములు కోనుగోలు చేసి విక్రయించినట్లు గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు రాజీవ్‌ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. అగ్రిగోల్డ్ భూముల లావాదేవీల కేసులో ఏ1 గా ఉన్న జోగి రాజీవ్, ఏ2గా జోగి రమేష్ బాబాయి జోగి వెంకటేశ్వరరావు ఉన్నారు.
ఈ సందర్భంగా రాజీవ్ మీడియా తో మాట్లాడుతూ.. వాళ్లెలా అమ్మారో.. తాము కూడా అలాగే అమ్మామని .. ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని, తన తండ్రిపై కక్షతోనే తనను అరెస్ట్ చేయించిందని పేర్కొన్నాడు. మరోవైపు జోగి రమేష్.. అధికారం ఎవరికీ శాశ్వతం కాదన్న విషయాన్ని చంద్రబాబు గుర్తుంచుకోవాలన్నారు.
Read Also : Murari Sequel : ‘మురారి’ సీక్వెల్ పై కృష్ణవంశీ కామెంట్స్.. అది డిసైడ్ చేయాల్సింది నేను కాదు..