జై భారత్ పార్టీ అధినేత, మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ (JD Laxminarayana ) ఏపీ ప్రజలంతా ప్రత్యేక హోదా ( AP Special Status) కోసం పోరాటం చేయాలనీ పిలుపునిచ్చారు. ఏపీలో మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ తో పాటు పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రజలను ఆకట్టుకునే పనిలో పడ్డాయి. ఇప్పటికే అధికార పార్టీ వైసీపీ తో పాటు టిడిపి పార్టీలు ప్రచారం మొదలుపెట్టగా..బిజెపి , జనసేన సైతం ఫిబ్రవరి నుండి ప్రచారం మొదలుపెట్టబోతున్నాయి. ఇదే క్రమంలో కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన షర్మిల సైతం దూకుడు పెంచింది.
రీసెంట్ గా ప్రత్యేక హోదా కోసం ప్రధాని మోడీకి లేఖ రాసి వార్తల్లో నిలిచింది. ఈ తరుణంలో జై భారత్ పార్టీ అధినేత, మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సైతం ప్రత్యేక హోదా అంశంపై ఫోకస్ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా తెచ్చేందుకు అందరూ కలిసికట్టుగా పోరాడాలని లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేలా ఎంపీలు పోరాడాలని అన్నారు. 7వ తేదీన హోదా, ఉక్కు పరిశ్రమపై ఢిల్లీలో గళం వినిపిస్తామని తెలిపారు. హోదా వల్ల కలిగే లాభాలను ప్రజలకు వివరిస్తూ.. ఉద్యమాన్ని ఉద్ధృతం చేసేలా పార్టీలు, ప్రజా సంఘాలు కలిసి రావాలని పేర్కొన్నారు.
ప్రత్యేక హాదాపై టీడీపీ, వైసీపీకి చిత్తశుద్ది లేదని దుయ్యబట్టారు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం కాదు.. ముగించిన హామీగా పేర్కొన్నారు. హోదా వద్దు ప్యాకేజీనే ముద్దు అని టీడీపీ, జనసేన నేతలు మాట్లాడారని దుయ్యబట్టారు. 22 ఎంపీలు ఇస్తే ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై సీఎం వైఎస్ జగన్ ఒత్తిడి తీసుకురాలేకపోతున్నారని విమర్శించారు. భవిష్యత్ కోసం జరుగుతున్న ఉద్యమం ఇది. అందరు ఈ ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
Read Also : CM Revanth Reddy : రేపు మరో రెండు గ్యారంటీలపై రేవంత్ ప్రకటన..?