జై భారత్ పార్టీ అధినేత, మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ (JD Laxminarayana ) ఏపీ ప్రజలంతా ప్రత్యేక హోదా ( AP Special Status) కోసం పోరాటం చేయాలనీ పిలుపునిచ్చారు. ఏపీలో మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ తో పాటు పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రజలను ఆకట్టుకునే పనిలో పడ్డాయి. ఇప్పటికే అధికార పార్టీ వైసీపీ తో పాటు టిడిపి పార్టీలు ప్రచారం మొదలుపెట్టగా..బిజెపి , జనసేన సైతం ఫిబ్రవరి నుండి ప్రచారం మొదలుపెట్టబోతున్నాయి. ఇదే క్రమంలో కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన షర్మిల సైతం దూకుడు పెంచింది.
We’re now on WhatsApp. Click to Join.
రీసెంట్ గా ప్రత్యేక హోదా కోసం ప్రధాని మోడీకి లేఖ రాసి వార్తల్లో నిలిచింది. ఈ తరుణంలో జై భారత్ పార్టీ అధినేత, మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సైతం ప్రత్యేక హోదా అంశంపై ఫోకస్ చేశారు. బుధువారం శ్రీకాకుళంలో ఆయన మాట్లాడుతూ.. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పాస్ కాకుండా చూడాలి.. బడ్జెట్‌ను స్తంభింపజేస్తే కేంద్రం ఆలోచిస్తుందన్నారు. విభజన హామీలు, ప్రత్యేక హోదా సాధించేందుకు అనేక అవకాశాలు వచ్చాయి.. 2019 నుంచి ప్రతిసారీ రాష్ర్టానికి చెందిన ఉభయపార్టీలు.. ఎన్టీఏకు మద్దతు పలికారు.
ప్రత్యేక హాదాపై టీడీపీ, వైసీపీకి చిత్తశుద్ది లేదని దుయ్యబట్టారు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం కాదు.. ముగించిన హామీగా పేర్కొన్నారు. హోదా వద్దు ప్యాకేజీనే ముద్దు అని టీడీపీ, జనసేన నేతలు మాట్లాడారని దుయ్యబట్టారు. 22 ఎంపీలు ఇస్తే ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై సీఎం వైఎస్ జగన్ ఒత్తిడి తీసుకురాలేకపోతున్నారని విమర్శించారు. భవిష్యత్ కోసం జరుగుతున్న ఉద్యమం ఇది. అందరు ఈ ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
Read Also : YS Sharmila : నిన్ను దేవుడు కూడా క్షమించడు అంటూ షర్మిల ఫై నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ ఫైర్..