JC Prabhakar reddy : తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ కు జేసీ రాజీనామా..

మున్సిపల్ ఛైర్మన్ పదవికి నెల రోజుల్లో రాజీనామా చేసి టీడీపీలో ఇతర నేతలకు అప్పగిస్తానని జేసీ వెల్లడించారు

  • Written By:
  • Publish Date - June 6, 2024 / 01:25 PM IST

ఏపీలో కూటమి ప్రభంజనం సృష్టించింది. వై నాట్ అంటూ 175 అంటూ విర్రవీగిన వైసీపీ ని 11 స్థానాలకు పరిమితం చేసింది. కూటమి దెబ్బ ఎలా ఉంటుందో జగన్ కు దిమ్మతిరిగేలా చూపించారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూటమి శ్రేణులు సంబరాల్లో మునిగితేలుతున్నారు. ఐదేళ్లుగా కష్టాలు , నష్టాలు అనుభవించిన వారంతా ఇప్పుడు మంచి రోజులు రాబోతున్నాయంటూ చెప్పుకుంటున్నారు. ఈ తరుణంలో తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ పదవికి రాజీనామా చేయబోతున్నట్లు జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రకటించి షాక్ ఇచ్చారు.

We’re now on WhatsApp. Click to Join.

ప్రస్తుతం తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ గా ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డి ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసి తన భవిష్యత్ వ్యూహాల్ని వెల్లడించారు. మున్సిపల్ ఛైర్మన్ పదవికి నెల రోజుల్లో రాజీనామా చేసి టీడీపీలో ఇతర నేతలకు అప్పగిస్తానని జేసీ వెల్లడించారు. అయితే నెక్స్ట్ ఏంటి..? ఏంచేయబోతున్నారు..? అనేది తెలుపలేదు. తాడిపత్రిలో ఐదేళ్లుగా స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డితో సై అంటే సై అంటూ రాజకీయాలు నడిపిన జేసీ ప్రభాకర్ రెడ్డికి టీడీపీలో కీలక పదవి దక్కుతుందని ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే మున్సిపల్ ఛైర్మన్ పదవికి రాజీనామా చేయబోతున్నారని టీడీపీ శ్రేణులు భావిస్తున్నారు. తాడిపత్రి నుంచి ఈసారి ఎమ్మెల్యేగా తన కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డిని గెలిపించుకున్న జేసీ ప్రభాకర్ రెడ్డి.. నియోజకవర్గంపై పట్టు పెంచుకునేందుకు ప్రయత్నించే అవకాశం ఉంది.

Read Also : World Leaders : మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రపంచ దేశాధినేతలు