తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీసీ మంత్రులు చేపట్టనున్న బస్సుయాత్రలో బస్సులపై రాళ్లు రువ్వే అవకాశం ఉందన్నారు. బస్సులకు సేఫ్టీ గార్డులు వేస్తే బాగుంటుందని, వాహనాలకు పోలీసులు ఫెన్సింగ్ వేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.
రాష్ట్రంలో గత మూడేళ్లుగా అమలవుతున్న సామాజిక న్యాయాన్ని ప్రజలకు వివరించేందుకు, చేస్తున్న తప్పుడు సమాచారాన్ని తిప్పికొట్టేందుకు రాష్ట్ర మంత్రులు ‘సామాజిక న్యాయబేరి’ పేరుతో బస్సుయాత్ర చేపడుతున్న సంగతి తెలిసిందే.
ఈ నెల 26న శ్రీకాకుళం నుంచి బస్సుయాత్ర ప్రారంభమై 29న అనంతపురంలో ముగుస్తుంది. ఈ పర్యటనలో ప్రతిరోజూ బహిరంగ సభ నిర్వహించనున్నారు. అయితే కెసి ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై కుట్ర జరుగుతుందనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ఆయన చేసిన కామెంట్స్ ఏపీలో రాజకీయ హీట్ పెంచింది.