Site icon HashtagU Telugu

Tadipatri : హాస్పటల్ లో చికిత్స తీసుకుంటున్న జేసీ ప్రభాకర్ రెడ్డి

Jc Prabhakar Hsp

Jc Prabhakar Hsp

ఏపీలో ఎన్నికలు (AP Elections) కాస్త ప్రశాంతగానే ముగిసాయి అని అంత అనుకున్నారో లేదో..పోలింగ్ రోజును మించిన దాడులు ఇప్పుడు జరుగుతున్నాయి. నిన్నటి నుండి అనేక జిల్లాలో వైసీపీ శ్రేణులు రెచ్చిపోతున్నారు. టీడీపీ నేతలపై , కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారు. ఇంట్లో ఆడవారి ఫై కూడా దాడులు చేస్తూ నానా బీబత్సం సృష్టిస్తున్నారు. ఈ దాడుల నేపథ్యంలో ప్రజలు వణికిపోతున్నారు. ఇప్పుడు ఎలాంటి దాడి జరుగుతుందో..? ఎటునుండి వచ్చి దాడి చేస్తారో..? అని భయపడుతున్నారు. ఈ దాడుల నేపథ్యంలో పోలీసులు పెద్ద ఎత్తున చేరుకున్నప్పటికీ..కొంతమంది మాత్రం ఏమాత్రం భయపడకుండా పోలీసుల ముందే దాడులకు పాల్పడుతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

నిన్న తాడిపత్రి (Tadipatri )లో టీడీపీ , వైసిపి వర్గీయుల మధ్య ఘర్షణ రాళ్ల దాడికి దారి తీయగా, ఈ దాడిలో ఇరు వర్గాలకు చెందిన ఇద్దరు గాయపడటంతో పాటు, పోలీసులు కూడా గాయపడ్డారు. ఎస్పీ వాహనాన్ని ఆందోళనకారులు ధ్వంసం చేశారు. నిన్న జరిగిన ఈ ఘటనలో సీఐ మురళీకృష్ణ కు గాయాలయ్యాయి. ఈ దాడికి నిరసనగా జేసీ ప్రభాకర్ రెడ్డి ధర్నాకు దిగారు. తర్వాత ఆయన వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటి వైపు కార్యకర్తలతో వెళుతుండగా వైసీపీ శ్రేణులు అక్కడికి భారీగా చేరుకున్నాయి. ఈ క్రమంలో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ను ప్రయోగించారు. ఈ గ్యాస్ ఎఫెక్ట్ తో జేసీ లంగ్స్ ఇన్ఫెక్షన్ కు గురయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు హైదరాబాద్ తరలించి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం తాడిపత్రిలో ఎప్పుడు ఏంజరుగుతుందో అని పార్టీ శ్రేణులతో పాటు , పోలీసులు ఖంగారు పడుతున్నారు.

Read Also : RR vs PBKS: బట్లర్ లేకుండానే బరిలోకి.. రాజస్థాన్ రాయల్స్‌ లో మైనస్ అదే